తెలంగాణ

పోలీసు అకాడమీలో అవతరణ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర నాలుగవ అవతరణ దినోత్సవ వేడుకలను పోలీ సు కార్యాలయాలు, జైళ్ళ శాఖలో శనివారం ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర అవతరణకు దోహదపడిన మహనీయులను స్మరించుకున్నారు. ఆర్‌బివిఆర్‌ఆర్ తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో అత్యంత వేడుకగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అకాడమీ డైరక్టర్ సంతోష్ మెహ్రా ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. శిక్షణలో ఉన్న వారంతా అకాడమీ మైదానంలో జాతీయ పతాకానికి సెల్యూట్ చేశారు. తొలుత డైరక్టర్ సంతోష్‌మెహ్రా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అకాడమీలోని అన్ని స్థాయిల్లోని అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణలో ఉన్న వారు అందించిన గౌరవ వందనాన్ని డైరక్టర్ స్వీకరించారు. కాగా, రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో సాంకేతిక విభాగం అదనపు డీజీపీరవిగుప్తా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం మహనీయుల చిత్రపటాలకు కూడా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. చంచల్‌గూడలో ఉన్న జైళ్లశాఖ డైరక్టర్ జనరల్ కార్యాలయంలో డీజీ వినయ్‌కుమార్ సింగ్ జాతీయపతాన్ని ఎగురవేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జైళ్ళశాఖ ఐజీ ఎ.నరసింహ, డీఐజీ బి.సైదయ్య తదితరులు పాల్గొన్నారు. బషీర్‌బాగ్‌లో ఉన్న నగర పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో మినిస్టీరియల్ సిబ్బం ది రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించారు. జాతీయ జెండాను ఎగురవేశారు.

చిత్రం..డీజీపీ కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అదనపు డీజీ రవిగుప్తా