తెలంగాణ

వెల్లివిరుస్తున్న ‘ శాంతిభద్రత’లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 2: రాష్ట్రంలో శాంతిభద్రతలు వెల్లివిరుస్తున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర నాలుగో అవతరణ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పెరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, పోలీసు శాఖను పూర్తిగా ఆధునీకరించామన్నారు. రాష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గాయన్నారు. హైదరాబాద్‌లో పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం పూర్తి కావచ్చిందని సీఎం తెలిపారు. హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో గుడుంబా తయారీ, అమ్మకాలను పూర్తిగా రూపుమాపామన్నారు. పేకాట క్లబ్బులను మూసివేయించామని, ఆన్‌లైన్ పేకాటతో పాటు ఇతరత్రా జూదాల ఆటలను అరికట్టకలిగామన్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ప్రజల్లో భద్రతాభావం నెలకొందని, గుడుంబా, పేకాట ఆగిపోవడంతో కుటుంబాల్లో మహిళలు ఆనందపడుతున్నారన్నారు. విత్తనాలతో పాటు ఆహార పదార్థాల కల్తీని అరికట్టడంలో కూడా పోలీసు శాఖ పనిచేస్తోందన్నారు. నేరాలను అరికట్టడంలో ప్రజలు ప్రభుత్వానికి, పోలీసు శాఖకు చేయూత ఇవ్వాలని సిఎం కోరారు.