తెలంగాణ

ఇఫ్తార్ విందులో కేసీఆర్‌పై ఉత్తమ్ మండిపాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: తెలంగాణలో ముస్లింలను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేస్తున్నారని పీసీసీ ఛీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు సీ ఎల్పీ నేత జానారెడ్డి, మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, భట్టివిక్రమార్గ, నగర అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్, దానం నాగేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అత్యంత పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలు ఎతో భక్తితో ఉపవాస దీక్షలు చేయడం ఎంతో భక్తితో కూడుకున్నదని అన్నారు. ఎన్నికల ముందు ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా రిజర్వేషన్ల మాటే ఎత్తడం లేదని దుయ్యబట్టారు. ముస్లింలకు రంజాన్ పేరుతో బట్టలు, బహుమానాలు ఇవ్వడం కాదు రిజర్వేషన్లు అమలు చేస్తే విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి సాధించే అవకాశం ఏర్పడుతోందన్నారు. దేశంలో ముస్లింలకు రక్షణ లేకుండా పోయిందని, వారు ఏం తినాలి, ఏం మాట్లాడాలని, ఏం ధరించాలి అన్న విషయాలను సైతం వారే నిర్ణయిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారని అన్నారు. కేసీఆర్, ఎంఐఎం నేతలు బీజేపీకి రహసత్యంగా సహకరిస్తున్నారని అంతా కలిసి ముస్లింలకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.