తెలంగాణ

‘పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 17: మన కోసం, మన హక్కుల కోసం మనమే పోరాడాలని తెలంగాణ విద్యుత్ ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఆల్ ఇండియా ఈక్వాలిటీ ఫోరం రాష్ట్ర కార్యదర్శి బానుప్రకాష్ పిలుపు ఇచ్చారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వల్ల ప్రతిభకు అన్యాయం జరుగుతోందని ఆయన ధ్వజమెత్తారు. కోర్టుల్లో సాధించుకున్న హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాల వైఖరికి నిసనగా ఆదివారం జిహెచ్‌ఎంసి వద్ద సంఘం మహాధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగాల కోసం దళిత, వెనకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించడంలో ఏలాంటి తప్పులేదని, కానీ అన్ని రంగాల్లో ప్రతిభను పాతరేయడానికి ప్రభుత్వాలు ఓట్ల కోసం కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని, కేవలం పదోన్నతుల్లో రిజర్వేషన్లను కొనసాగించడం పట్ల ప్రతిభ అనుభవం కల్గిన ఒసీ,ఈబిసీ, మైనార్టీ వర్గాల ఉద్యోగులు అనేక రకాలుగా నష్టపోతున్నారని ఆయన వాపోయారు. ప్రమోషన్లలో రిజర్వేషన్లు పాటించవద్దని, ఈ విషయాలపై త్వరలోనే రాష్టప్రతి, ప్రధాని, గవర్నర్, ముఖ్యమంత్రిని కలిసి వివరిస్తామని తెలిపారు.