తెలంగాణ

ఆరు నెలలుగా అందని గౌరవ వేతనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూన్ 24: ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకే వేతనాలు అందని పరిస్థితి నెలకొంది. స్థానిక సంస్థలకు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం గౌరవ వేతనం ఇస్తుంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత వారి వేతనాన్ని భారీగా పెంచారు. మూడు నెలలకు ఒకసారి వేతనం చెల్లిస్తూ ఉంటారు. కానీ ఈసారి ఆరునెలలు గడుస్తున్నా విడుదల చేయకపోవడంతో స్థానిక ప్రజాప్రతినిధులు వేతనాల కోసం నిరీక్షిస్తున్నారు. స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారిలో అధిక శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారే. వీరిలో ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నవారు అనేక మంది. వారంతా గౌరవ వేతనం కోసం ఎదురుచూస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ వరకు గౌరవ వేతనం విడుదల చేసి జనవరి నుంచి నిలిపివేశారు. రాష్ట్రంలో 6,473 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా, 441 మంది మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, 441 మంది జెడ్పీటీసీలు, 30 మంది జెడ్పీ చైర్మన్లు ఉన్నారు. ఒక్కో ఎంపీటీసీకి రూ. 5వేలు, మండల ప్రజాపరిషత్ అధ్యక్షునికి రూ. 10వేలు, జెడ్పీటీసీకి రూ. 10వేలు, జిల్లా పరిషత్ అధ్యక్షునికి లక్ష రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇస్తారు. ఆరు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. గౌరవ వేతనం అందకపోవడంతో ప్రజాప్రతినిధులు స్థానిక సమస్యలను పట్టించుకోవడం మానివేశారు. తమ పదవీకాలం పూర్తవుతున్న దశలో ప్రభుత్వం మరోసారి తమకు అవకాశం లభించే పరిస్థితి లేదని, ఉన్న కాలానికైనా గౌరవ వేతనం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.