తెలంగాణ

అటవీ భూముల్లోనూ హరితహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: నానాటికి క్షీణిస్తున్న అడవులకు పూర్వవైభవం కల్పించేందుకు అటవీ శాఖ ప్రత్యేక కార్యచరణతో ముందుకు సాగుతోంది. అటవీ భూములుగా పేర్కొంటున్న చాలా భూముల్లో అటవీ సంపద కనుమరుగైన కళావిహీనంగా దర్శనమిస్తుండటం సర్వసాధారణంగా మారింది. ఆయా భూములను గుర్తిం చి వాటిని దట్టమైన అడవులుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపధ్యంలో ఈ అంశంపై అటవీ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ప్రస్తుత హరితహారంలో 30 శాతం మొక్కలను అటవీ ప్రాంతాల్లోనే నాటాలని నిర్ణయించింది. క్షీణించిన, నిరుపయోగంగా ఉన్న అటవీ ప్రాంతాలను గుర్తించి అక్కడ మొక్కలు నాటాలని కార్యచరణ సిద్ధం చేస్తోంది. ఇలాంటి చర్యల వల్ల అడవులు తిరిగి పచ్చదనం సంతరించుకోవడంతో పాటు అన్ని రకాల జీవరాసులకు తగినంత ఆహారం లభించనుంది. రికార్డుల్లో అడవులుగా ఉండి ఎకరాల కొద్ది ఎండిపోయిన అటవీ ప్రాంతాలపై కొం దరు ఉద్దేశపూర్వకంగా కనే్నసి వాటిని అక్రమించుకుంటున్నారు. ఇలా ఆక్రమణలకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం అటవీ శాఖకు పెను సవాలుగా మారుతోంది. చాలా చోట్ల తప్పుడు ధ్రువపత్రాలను సృష్టించి అటవీ భూములను ప్రభుత్వం తమకు అప్పగించిందని ఎదురుతిరుగుతండటంతో ఆయా భూములు కోర్టు చిక్కుల్లోకి వెళ్లల్సి వస్తుంది. వీటన్నింటి నేపథ్యంలో ఓ వైపు హరితహారం ప్రాధమిక లక్ష్యం పచ్చదాన్ని పెంపొందించడంతో పాటు అటవీ భూములను పూర్తిస్థాయి లో రక్షించే అవకాశం దీని ద్వారా ఏర్పతుంది.
వన్యప్రాణులకు ఆవాసం...
అటవీ సంపద తగ్గుతుండటంతో ఆయా ప్రాంతాల్లో నివసించే వన్యప్రాణులు సమీప గ్రామాల్లోకి ప్రవేశించడం అక్కడి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు సృష్టించడం జరుగుతోంది. ప్రభు త్వ ఆదేశాల ప్రకారం అటవీ బ్లాక్‌లకు పూర్వస్థితిని తీసుకురాగలిగితే జీవరాసులకు ఆవాసం ఏర్పడి వసలకు అవకాశం లేకుండా పోతుంది. దీంతో గ్రామాల్లో కోతులు, ఇతర జీవుల బెడద నుంచి ప్రజలు ఉపశమనం పొంది ఆరోగ్య వంతమైన వాతావరణం ఉంటుంది.