తెలంగాణ

చర్చలు విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: రేషన్ డీలర్లతో ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన చర్చలు విఫలం అయ్యాయి. డీలర్ల సమస్యలపై అధ్యాయనానికి ముగ్గురు సభ్యులతో కమిటీ వేస్తున్నామని, కమిటీ నివేదిక వచ్చే వరకు సమ్మె విరమించుకోవాలని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని డీలర్ల సంఘం అంగీకరించలేదు. దీంతో తమ సమ్మెను కొనసాగుతుందని డీలర్ల సంఘం ప్రకటించింది. డీలర్ల సమ్మెతో పేద ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు కమిషనర్ ప్రకటించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ కంట్రోలర్ ఆర్డర్ 2016, నిత్యావసర సరుకుల చట్టం 1955 ప్రకారం పంపిణీకి ఆటంకం కలిగిస్తే ఏ డీలర్‌నైనా తొలగించి వారి స్థానంలో మరొకరిని నియమించుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని కమిషనర్ హెచ్చరించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించాలని కమిషనర్ సూచించినప్పటికీ డీలర్ల సంఘం మెట్టుదిగలేదు. దీంతో చర్చలు అర్ధాంతరంగా ముగిసాయి. పౌరసరఫరాలశాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఆదివారం తన కార్యాలయంలో రేషన్ డీలర్ల సంఘంతో మూడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రేషన్ డీలర్ల సమ్మె వల్ల వచ్చే నెల నుంచి నిత్యావసర సరుకుల పంపిణీకి ఆటంకం కలుగకుండా పౌరసరఫరాల శాఖ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని కమిషనర్ తెలిపారు. రాష్ట్రంలో ప్రతీ నెలా 85 లక్షల మంది పెద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తుందన్నారు. సరుకులకు సకాలంలో లబ్ధిదారులకు అందించడం డీలర్ల కనీస బాధ్యత అన్నారు. ఇలా ఉండగా కేరళ, తమిళనాడు మాదిరిగా డీలర్లకు రాష్ట్రంలో వేతనాలు ఇవ్వాలని, పాత బకాయిలను చెల్లించాలని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

చిత్రం..రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులతో చర్చలు జరుపుతున్న కమిషనర్ అకున్ సబర్వాల్