తెలంగాణ

శృంగేరీ స్వామికి భక్తజన నీరాజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, జూన్ 26: జగద్గురు దక్షిణామ్నాయ శృంగేరీ పీఠాధీశ్వర శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ తీర్థ స్వామికి ధర్మపురి క్షేత్రంలో అశేష జనం నీరాజనాలు పలికారు. మంగళవారం రాత్రి క్షేత్రానికి అరుదెంచిన స్వామి వారికి భారీ వర్షంలో నంది విగ్రహ కూడలిలలో పూర్ణకుంభ యుక్త అఖండ స్వాగతం పలికారు. ప్రత్యేక విజయరథ వాహనంలో స్వామి వారు వేంచేయగా, బ్రాహ్మణ సంఘ భవనం వరకు ఊరేగింపుతో, మంగళ హారతుల, వేద మంత్రోచ్ఛాటనల మధ్య సాంద్రాయక స్వాగతం పలికారు. అనంతరం ధర్మపురి శ్రీమఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చితానంద సరస్వతి స్వామి, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, జగిత్యాల కలెక్టర్ డా.శరత్, దేవస్థానం ఎసి,ఇఓ సుప్రియ, బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు రామయ్య, దేవస్థానం మాజీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీటీసీ దినేశ్ తదితరులు రాష్ట్ర ప్రభుత్వ అతిథియైన పీఠాధీశ్వరుడిని స్వాగతించారు. స్వామీజీ పాదుకల పూజ, శృంగేరీ ఆస్థాన పౌరాణికులు బాచంపెల్లి సంతోష్ శర్మ స్వాగత పత్ర సమర్పణ గావించారు. పౌరాణికులు సంతోష్ కుమార్ శాస్ర్తీ దంపతులు ప్రత్యేక ఆహ్వాన పూజలు నిర్వహించగా, జిల్లా కలెక్టర్ డా.శరత్, సంతోష్ శర్మలు అభిభాషించారు. అనంతరం వేదికపై చంద్రవౌళీశ్వర పూజాదికాలను నిర్వహించారు. ఎస్పీ సునిల్ దత్ ప్రత్యక్ష పర్యవేక్షణలో సిఐ లక్ష్మీబాబు, ఎస్‌ఐలు, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.