తెలంగాణ

ముందస్తుకు మేమూ సిద్ధమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ: ముందస్తు ఎన్నికలకు టీజే ఎస్ సిద్ధమేనని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయడం రాజకీయ పార్టీలకు సహజమేనని దీనిపై సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలకు సవాళ్లను విసరడం ఆయన వికృత, పిల్ల చేష్టలకు, అహంభావానికి నిదర్శనమని విరుచుకు పడ్డారు. సోమవారం నల్లగొండలో జిల్లా టీజేఎస్ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌కు నిజంగా ప్రజల్లో ఆదరణ, బలముంటే కేసీఆర్ సర్వేల్లో నిజముంటే దానం నాగేందర్ వంటి ఫిరాయింపుదారులను, ఉద్యమవ్యతిరేకులను అరువు తెచ్చుకోవడమేందుకని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ తన సర్వేలతో టీఆర్‌ఎస్ 100 సీట్లు గెలుస్తోందంటూ ఒకసారి, 35మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని మరోసారి, దానం చేరికతో పార్టీ బలపడిందని ఇంకోసారి భిన్నమైన మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, ఉద్యోగాలొచ్చి ప్రజలకు, యువతకు, రైతులకు మంచి రోజులొస్తాయనుకుంటే కేవలం గుప్పెడు మందికే ప్రయోజనం కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. 25వేల కోట్లతో చేపట్టాల్సిన ప్రాణహిత ఎత్తిపోతలను 90వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టుగా రీడిజైన్ చేసి నిర్మించాల్సిన అవసరం లేకున్నా కేవలం కాంట్రాక్టర్ల కోసం, కమీషన్ల కోసమే సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో దుబారా చేస్తున్న ప్రజాధనంతో విద్యార్థుల ఫీజురీయంబర్స్‌మెంట్‌కు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి, ఏకకాల రుణమాఫీ, వడ్డీలేని రుణాలకు, పింఛ న్లు, రైతులకు ధాన్యం డబ్బుల చెల్లింపులకు, డబుల్ బెడ్‌రూమ్‌లకు నిధులు దక్కేవన్నారు. రైతుబంధు ప్రచారానికే 85 కోట్ల ప్రకటనలిచ్చారని, తన థర్ట్ ఫ్రంట్ భూకంపం కోసం ఇతర రాష్ట్రాల్లో సైతం ప్రకటనలిచ్చి ప్రజాధనం దుర్వినియోగం చేశారన్నారు. తన ఇంట్లో భూకంపం తట్టుకోలేక థర్డ్‌ఫ్రంట్ పాట అందుకున్నాడన్నారు. భూరికార్డుల ప్రక్షాళన రైతుల బతుకుల్లో చిచ్చు పెట్టిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజాధనాన్ని రాజకీయ దోపిడీ చేస్తోందని, దీనిని ప్రశ్నిస్తే ధర్నాచౌక్ ఎత్తేసి కేసులు పెట్టి, జైలుపాలుచేశారని కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు మారాలంటే రాజకీయ మార్పు అవసరమని భావించే టీజెఎస్ ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను, ఎన్నికల హామీలను విస్మరించి సీఎం కేసీఆర్ సాగిస్తున్న నియంతృత్వ, అప్రజాస్వామిక పాలనను ప్రశ్నించే వేదికగా టీజేఎస్ ప్రజల పక్షాన నిలబడిందన్నారు. రాజకీయాల లక్ష్యం గుప్పె డు మంది ప్రయోజనాలు కాదని, సమాజం బాగు కోసమని నిస్వార్థంగా పనిచేసే వారితోనే రాజకీయాలు సాగాలన్నారు. వేములకొండ ట్రాక్టర్ ప్రమాద ఘటన మృతులకు ప్రభుత్వం పది లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని అన్నారు. నిర్దిష్టమైన విధానం ప్రభుత్వం రూపొందించుకోవాలన్నారు. ఈ సమావేశంలో టీజేఎస్ కార్యాలయ దాత, దిల్లీలో జేఏసీ కోఆర్డినేటర్, సుప్రీంకోర్టు న్యాయవాది డోకూరి రామకృష్ణారెడ్డి, జిల్లా పార్టీ నాయకులు విద్యాధర్‌రెడి తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..నల్లగొండలో టీజేఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న కోదండరాం