తెలంగాణ

ఇంజనీరింగ్ అద్భుతం ‘కాళేశ్వరం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 25: కాళేశ్వరం ప్రాజెక్టు, మన కాలపు మహా ప్రాజెక్టు.. కాలం కాని కాలంలో నిర్మితమవుతున్న అతి భారీ ప్రాజెక్టు. ఒకటి కాదు, రెండు కాదు నిర్మాణ విశిష్టతలు, అనేక ప్రయోజనాలను సమకూర్చబోతున్న ఒక ఆధునిక అద్భుతం, ఈ ప్రాజెక్టు ఇంకా జలకళను సంతరించుకోక ముందే ఇక్కడ ‘జనకళ’ ఉట్టిపడుతోంది. ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతమంతా ప్రజల సందర్శనలతో ఒక జాతరను తలపిస్తోంది. పరిసర ప్రాంతాల ప్రజలు మొదలుకొని, జాతీయ, అంతర్జాతీయ బృందాల వరకు కాళేశ్వరంలో జరుగుతున్న ఇంజనీరింగ్ అద్భుతం చూసేందుకు బారులు తీరుతున్నారు. దీంతో వరదకాలంలో గోదావరి నీటి మట్టం పెరిగినట్టుగా ఈ ప్రాజెక్టుకు జనం తాకిడి పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 83వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తి అయినట్లైతే తెలంగాణలోని 42 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. మరో ఏడాదిలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం దృఢసంకల్పంతో ఉంది. అందుకోసం రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టీ. హరీష్‌రావు రేయింబవళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పర్యవేక్షణలో ఉండి అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. మరోవైపు అధికారులు, కార్మికులు మూడు షిప్టులలో క్షణం తీరికలేకుండా పనులు చేస్తున్నారు. కనె్నపల్లి పంప్ హౌస్‌లో నిర్మిస్తున్న 139 మెగా వాట్ల సామర్థ్యంగల ఎనిమిది మోటర్లతో పంపింగ్ చేసినట్లైతే రోజుకు రెండు టీఎంసీల నీరు అన్నారం బ్యారేజీకి పంపింగ్ అయ్యే విధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందడంతో ఈ ప్రాజెక్టును సందర్శించేందుకు వచ్చే జనం జాతరను తలపిస్తుంది. మాజీ సీఎం హేమంత్ సోరెన్, పంజాబ్ మంత్రి సిద్ధు, కేంద్ర బృందం, గవర్నర్ నరసింహన్‌లాంటి వారు ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. ఇటీవల కాలంలో ప్రాజెక్టును సందర్శించే సందర్శకుల తాకిడి మరింత ఎక్కువైంది. తెలంగాణ లోని అన్ని నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, వారి కార్యకర్తల బృందం కాళేశ్వరం టూరు ఏర్పా టు చేశారు. మంధని ఎమ్మెల్యే పుట్టమధు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బృందం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు రాగ సోమవారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, మహబూబూబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యేరెడ్యానాయక్ బృందం ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు. రోజురోజుకు సందర్శకుల తాకిడితో కాళేశ్వ రం పరిసరాల ప్రాంతమంతా జన జాతరగా మారిపోయింది. ఎక్కడచూసిన కాళేశ్వరం ప్రాజెక్టుపైనే చర్చ జరుగుతుంది కాగా, ఇటీవల మంత్రి హరీష్‌రావు కాళేశ్వరం సందర్శన టూరు పేరుతో హైదరాబాద్ నుండి ప్రత్యేక ఆర్టీసీ బస్సుల సేవలను ప్రారంభించారు.
చిత్రం..కాళేశ్వరంలో పర్యటిస్తున్న పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్