తెలంగాణ

రైతుల పట్ల కేసీఆర్‌ది కపట ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, జూన్ 26: రైతుబంధు ప్రతిష్టాత్మకమైన పథకం అని చెబుతున్నా సగానికి పైగా అవకతవకలు దొర్లాయని.. రైతు బీమా పథకం అన్ని వర్గాల రైతులకు వర్తింపజేసి ధీమా కల్పించకుండా రైతుల పట్ల సీఎం కేసీఆర్ కపట ప్రేమ ఒలకబోస్తున్నారని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం జగిత్యాలలోని స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేక దృష్టి మర్చేలా రైతుబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ తెరపైకి తీసుకువచ్చారని విమర్శించారు. ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే రైతు పథకంలో సగానికిపైగా తప్పులే దొర్లినా పట్టించుకోకుండా ప్రభుత్వం ప్రచారాలు ప్రాధాన్యత ఇస్తుండడం శోచనీయమన్నారు. రైతుబంధులో 20-25శాతం పట్టాదారు పాసుబుక్ లు కూడా పంపిణీ కాలేదని, చేసిన దాంట్లో 50 శాతానికిపైగా తప్పులు దొర్లాయన్నారు. స్పష్టత లేక తప్పులు సవరణ కోసం కార్యాలయాల చుట్టూ రైతులు తిరగాల్సి వస్తోందన్నారు. రైతుబంధు విషయంలో ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోందని దీంతో నిజమైన రైతులు నష్టపోతున్నారని ఎంతమంది విజ్ఞప్తి చేసినా సీఎం కేసీఆర్ పెడచెవినే పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుబీమా స్వాగతిస్తున్నాం కాని ఇది భూయజమానులకే వర్తింపజేసేలా చేయడం బాధాకరమన్నారు. జగిత్యాల జిల్లాలో 54వేల మంది రైతులు అర్హుత పొందలేకపోతున్నారన్నారు. కేవలం లక్షా 10వేల మందికే జిల్లాలో బీమా వర్తిస్తోందని గుర్తు చేశారు. కేవలం అరశాతం మందికే ఇది ఉపయోగం పడుతుందని 70సంవత్సరాల వయస్సున్న రైతులకు కూడా వర్తింపజేయాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీమా కోసం చెల్లించే ప్రీమియం రూ. 2270 మాత్రమేనని ఎల్‌ఐసీపై ఎందుకు ఆధారపడుతున్నారనీ.. నేరుగా బాధితులకు నగదును అందజేయాలన్నారు. భూ యాజమానితో పాటు అసలైన రైతులకు, రైతు కూలీలకు కూడా రైతు బీమా అందించాలన్నారు. రైతుకూలీల పట్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రభుత్వం ప్రచారాలకు ఇచ్చిన ప్రధాన్యత ప్రత్యక్షంగా దోహదపడే రైతులు, రైతు కూలీలను విస్మరించడం సరికాదన్నారు. గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు రైతుబీమా పథకం అందించాలని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి, టీపీసీసీ సభ్యులు గిరి నాగభూషణం పాల్గొన్నారు.