తెలంగాణ

నిమ్స్‌లో మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ కోర్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 26: ఆసుపత్రుల నిర్వహణ, అనుసంధానం తదితర రంగాల్లో ఉన్నతంగా స్థిరపడాలనుకునే వారి కోసం నిజాం ఇన్సిటిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ (ఎంహెచ్‌ఎం) కోర్సును ఆఫర్ చేస్తున్నారు.
ఈ కోర్సు పూర్తి చేసిన వారు ఫార్మా, ఇన్సూరెన్స్, మెడికల్ టూరిజం, హెల్త్‌కేర్ ఐటీ, హెల్త్‌కేర్ రీసెర్చ్ అండ్ డవలప్‌మెంట్ రంగాలతో పాటు కార్పొరేట్ ఆసుపత్రుల నిర్వహణలో అవకాశాలు చేజిక్కించుకోవచ్చు. ఎంబీబీఎస్, బీడీఎస్, యూనానీ, హోమియోపతి, ఆయుర్వేదం పూర్తి చేసిన వారితో పాటు బీటెక్, సాధారణ డిగ్రీలు పూర్తి చేసిన వారు అర్హులే. 2018, డిసెంబర్ 31 నాటికి 30 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండున్నర సంవత్సరాల కాల పరిమితి నాలుగు సెమిస్టర్లు, ఆరునెలల పాటు ఇంటర్నషిప్ శిక్షణ ఉంటుంది. అభ్యర్థులు ఈనెల 30 చివరి తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చేనెల 16న రాత పరీక్ష ఉంటుంది. అనంతరం వ్యక్తిగత ఇంటర్‌వ్యూ అనంతరం అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాల కోసం తీతీతీ.శజౄఒ.ళజూఖ.జశ వైబ్‌సైట్‌లో ధరఖాస్తు డోన్‌లోడ్ చేసుకొని చూడవచ్చు. ఫోన్‌నెంబర్లు 040-23489189, 9490295019 నెంబర్లలో సంప్రదించవచ్చు.
ఉజ్వల భవిష్యత్
ఎంహెచ్‌ఎం కోర్సు పూర్తిచేసిన వారికి ఉజ్వల భవిష్యతు ఉంటుంది. మెడికల్ విద్య పూర్తిచేసిన వారితో పాటు సాదారణ డిగ్రీ చేసిన వారికి ఈ కోర్సు చేసే అవకాశం ఉండటం కలిసివచ్చే అంశం. కొద్దిపాటి సేవా భావం కలిగి ఉండి, వినూత్నంగా స్థిరపడాలనుకునే వారు ఈ రంగం అద్బుతంగా రాణించవచ్చు. ఉద్యోగ సంతృప్తితో పాటు అధిక వేతనాలు పొందవచ్చు. హెల్త్‌కేర్ రంగం నానాటికి అభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో శిక్షణ పూర్తిచేసుకున్న వారికి భారీ డిమాండ్ ఉంటుంది.
- డాక్టర్ మార్తా రమేష్, అకడమిక్ ఇన్‌చార్జ్