తెలంగాణ

కాంగ్రెస్ పార్టీది మేకపోతు గాంభీర్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జూన్ 26: ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధమేనంటూ ప్రకటనలు చేస్తూ కాంగ్రెస్ నేతలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సూర్యాపేట మండలం కేసారం గ్రామంలో మంగళవారం రైతు బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విలేఖరులతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎన్నికలకు సిద్ధమంటూ ఉత్తర కుమారునిలా ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలను ఎదుర్కొనే శక్తి, ధైర్యం లేవన్నారు. గత అసెంబ్లీ సమావేశంలో ఆ పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులు అనైతిక ప్రవర్తనపై సభ్యత్వాలు రద్దుచేస్తే ఉప ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేక కోర్టులను ఆశ్రయించిన వారు నేడు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమని, తామే గెలుస్తామని ప్రకటనలు చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. టీఆర్‌ఎస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెబుతున్న కాంగ్రెస్ నేతలు ప్రజలు ఎవరి వైపు ఉన్నారో తేల్చుకునేందుకు అవకాశం వస్తే ఎందుకు కోర్టుకు వెళ్లారో తెలుసుకోలేని స్థితిలో ఈ రాష్ట్ర ప్రజానీకం లేరన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తూ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషిచేస్తున్న టీఆర్‌ఎస్‌కు ప్రజలు తిరిగి పట్టం కట్టడం ఖాయమన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన తమ పార్టీ వందకు పైగా స్థానాల్లో సునాయాసంగా విజయం సాధిస్తుందని, అదేవిధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో గులాబీజెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. వచ్చే శాసనసభలో కాంగ్రెస్ సభ్యులు ఎవ్వరూ ఉండని విధంగా ఎన్నికల ఫలితాలు వస్తాయని జ్యోస్యం చెప్పారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, సూర్యాపేట ఎంపీపీ వట్టె జానయ్యయాదవ్ పాల్గొన్నారు.

చిత్రం..సూర్యాపేట మండలం కేసారంలో మీడియాతో మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి