తెలంగాణ

అవినీతి ఊబిలో కేసీఆర్ కుటుంబం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 26: కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని ప్రజాధనాన్ని తమ జేబుల్లోకి మళ్లించుకుని ఈ రాజ్యం తనదేనంటూ వ్యవహరిస్తూ త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. బీజేపీ జనచైతన్య యాత్రలో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో మంగళవారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా మార్చారని ఎద్దేవా చేశారు. ఇందుకు ప్రధాన కారణం కేసీఆర్ కుటుంబ పాలన అని దుయ్యబట్టారు. ఏ పథకం ప్రవేశపెట్టినా అందులో అవినీతి రాజ్యమేలుతోందని, అందులో కేసీఆర్ కుటుంబం, వారి బంధుగణం ఉన్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అవినీతి, అక్రమాలు బయటపడాలంటే తెలంగాణ ప్రజలు బీజేపీకి అధికారం ఇవ్వాలని కోరారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే కేసీఆర్, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన అవినీతి అక్రమాల చిట్టాపై విచారణ చేయించి ఎంతటివారినైనా కటకటాలకు పంపడం ఖాయమని హెచ్చరించారు. ఇలా అయితే తెలంగాణ తీవ్ర నష్టం ఏర్పడుతుందని ప్రజలను చైతన్యవంతం చేసి టీఆర్‌ఎస్‌ను గద్దెదింపాలని భావించి తాను జనచైతన్యయాత్రకు శ్రీకారం చుట్టానని తాను ఈ యాత్ర ద్వారా తెలుసుకున్నది మాత్రం నిజమని.. కేసీఆర్‌ను ఎప్పుడు పదవి నుండి దింపాలని ప్రజలు ఆలోచిస్తున్నారని అన్నారు. ఈ యాత్రతో ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారని ఇక బీజేపీకి పట్టం కట్టాలని కూడా భావిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలంటూ విద్యార్థులు, నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారని కానీ ముఖ్యమంత్రికి వారి విన్నపం మెదడుకు ఎక్కడంలేదని విమర్శించారు. కేసీఆర్ దిగిరావాలంటే నిరుద్యోగులు, విద్యార్థులు టీఆర్‌ఎస్‌పై తిరగబడాలని ఆయన పిలుపునిచ్చారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ప్రధానంగా కేసీఆర్ ప్రజలను ఆకర్శించిన పథకం డబుల్‌బెడ్‌రూం అని కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఎర్రవల్లిలో మాత్రం నిర్మించి వాటిని ప్రచారానికి ఊపయోగించుకుని ప్రజలను దగా చేశారని ధ్వజమెత్తారు. దేశంలో సామాజిక న్యాయం అంటూ చేసింది కేవలం బీజేపీయేనని అందుకు నిదర్శనం దళితుడు కోవింద్‌ను రాష్టప్రతిగా చేయడం, బీసీని ప్రధానమంత్రిగా చేయడం, గతంలో మైనారిటీ అయిన దివంగత అబ్దుల్ కలాంను రాష్టప్రతి చేసిన ఘన చరిత్ర బీజేపీదని అన్నారు. కాంగ్రెస్‌లో సామాజిక న్యాయం ఉండదని కేవలం ప్రజల మధ్య చిచ్చుపెట్టి ఓట్ల రాజకీయాలకు పాల్పడుతారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాలుగేళ్లలో సాధించిన విజయాలు చాలా ఉన్నాయని అన్నారు. బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి, బీజేపీ జాతీయ నాయకురాలు బండారు శృతి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాశం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి తల్లోజీ ఆచారి, జాతీయ గిరిజన మోర్చ నాయకుడు మంగ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట బహిరంగ సభలో ప్రసంగిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్