తెలంగాణ

సొంతింటి కల నెరవేరునా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూన్ 28: ఇళ్లు లేని పేదోళ్లందరికీ ఇళ్లు కట్టిస్తామని కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం నాలుగేళ్లుగా పేదోళ్లు ఎదురుచూస్తూనే ఉన్నారు. సొంతింటి కల సాకారం కలగానే మిగిలిపోనుం దా? అన్న నిరాశ వారిలో అలుముకుంది. ఇళ్ళ పనుల ప్రగతిపై ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించినా, లక్ష్యం దిశగా ‘డబుల్’ అడుగులు వేయలేకపోతోంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టిన అనంతరం పేదోడి సొంతింటి కల సాకారం చేసి తీరుతామని అట్టహాసంగా డబుల్ బెడ్రూం ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. జిల్లాల వారీగా ఇళ్ళు కేటాయించడంతో పాటు ఒక్కో ఇంటి నిర్మాణానికి రూరల్ ప్రాంతం లో రూ.5.04లక్షలు, అర్భన్‌లో రూ.5.30 లక్షలుగా కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కరీంనగర్ జిల్లాకు 6,454 ఇళ్ళు మంజూరీ చేసింది. ఇందులో ఇప్పటివరకు 1,845 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించగా, 4,612 అగ్రిమెంట్ దశలో ఉన్నాయి. 1,882 టెండర్ల దశలో ఉన్నాయి.