తెలంగాణ

ఇదేం నియంతృత్వ పోకడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, జూన్ 28: న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మెబాట పట్టిన రేషన్ డీలర్లను తొలగిస్తామని సీఎం కేసీఆర్ బెదిరింపులకు పాల్పడడం ఆయన నియంతృత్వ పోకడలకు నిదర్శమని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం జగిత్యాలలో ఆయన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ యూపీఏ హయాంలో నిరుపేదలు ఆకలితో అలమటించకూడదనే భావనతో ఆహార భద్రత చట్టాన్ని అమలులోకి తీసుకురావడంతోపాటు నిత్యావసర పంపిణీదారులైన డీలర్లకు ప్రతి క్వింటాల్‌పై రూ. 70 కమీషన్ లభించేలా ఇందులో రూ. 35 కేంద్రం భరించడం, మరో 35 రాష్ట్రం భరించేలా నిర్ణయించినప్పటికీ రూ. 20 కమీషన్ ఇవ్వడంతో ఆర్థిక భారం అవుతుందన్నారు. పారదర్శకత పాటించేందుకు ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా పంపిణీ చేసే మరో రూ. 17కలిపి రూ. 87ఇవ్వాల్సిందిపోయి రూ. 20చెల్లించడం దొర నియంతృత్వ ధోరణికి నిదర్శనమని జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రైస్ మిల్లర్ల నుండి ప్రభుత్వం గోదాంలకు చేరవేసిన బియ్యాన్ని బస్తాల సంఖ్యకు అనుగుణంగా మాత్రమే పరిగణలోకి తీసుకోవడం క్వింటాల్ బియ్యంపై క్వింటాల్‌కు 2నుండి 4కిలో వరకు తరుగు ఏర్పడడంతో ఈభారం డీలర్లపై పడుతుందన్నారు. గోదాంల్లో వేబ్రిడ్జి ఏర్పాటు చేసి పంపిణీదారులకు తూకంతో సరుకులు అందించాలన్నారు. డీలర్లను చర్చలకు ఆహ్వానించకుండా రెచ్చగొట్టే విధంగా మహిళా సంఘాలతో పంపిణీ చేయడం శాశ్వత పరిష్కారం కాదని కనీసం రూ. 20 వేలు చెల్లించాలని లేకపోతే డీలర్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్రం విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం రూ. 415కోట్ల డీలర్ల కమీషన్ ఉంచుకోవడం ప్రభుత్వ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు రేషన్ డీలర్ల దోషులుగా ప్రజల ముందు నిలబట్టే ప్రయత్నాలు చేయడం మానుకోవాలన్నారు. ఆడ బిడ్డల ఉసురు తగలొద్దని గ్యాస్ సిలిండర్లను కూడా 2014లో 420కే అందిస్తే నేడు అది 800లకు చేరిందని, 13కే లభించే కిరోసిన్ 26కు చేరిందని గతంలో పప్పు, ఉప్పుతో సహా 9సరుకులు రూ. 185కే రేషన్ దుకాణాల ద్వారా అందించామన్నారు. ఇప్పుడు కేవలం రూపాయికే కిలో బియ్యానే్న అందిస్తున్నారని అది కూడా ఎత్తేయాలనే ఆలోచనతోనే ఉన్నట్లు కనిపిస్తోం దన్నారు. డీలర్ల విజ్ఞప్తుల పెడచెవిన పెడుతూ మహి ళా సంఘాలకు రేషన్ షాపులు అప్పగించాలని చూడడం పరిష్కారం కాదనే విషయం ఆలోచించాలే కాని అధికారంలో ఉన్నాం ఏది చేసినా చెల్లుతుందనుకోవడం సీఎం కేసీఆర్‌కు సరికాదన్నారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి