తెలంగాణ

రేషన్ డీలర్లపై వేటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 28: డిమాండ్ల సాధనకు సమ్మె నోటీసు ఇచ్చిన రేషన్ డీలర్లను సామూహికంగా సస్పెండ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్టవ్య్రాప్తంగా 17,200 మంది రేషన్ డీలర్లకుగాను మొదటి విడతలో 14 వేల మందికి సస్పెన్షన్ నోటిసు లు జారీ చేయనుంది. డీలర్ల సమ్మెతో జూలై నుంచి మూత పడనున్న రేషన్ షాపుల నిర్వహణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో గురువారం జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాలశాఖ అధికారులతో కమిషనర్ అకున్ సబర్వాల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబర్వాల్ మాట్లాడుతూ, రేషన్ డీలర్ల సమ్మెతో పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా నిత్యావసర సరుకుల పంపిణీ బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగిస్తున్నామన్నారు. సస్పెండైన రేషన్ డీలర్ల స్థానంలో నియమించిన మహిళా సంఘాలు జూలై 5 నుంచి 10 వరకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ కార్యాలయాలు, ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ), యువజన సంఘాల భవనాలలో షాపులు ఏర్పాటు చేయాలని కమిషనర్ సూచించారు. మహిళా సంఘాలు వేయింగ్ మిషిన్లు సమకూర్చుకోవడంలో తూనికలు కొలతలశాఖ, పౌరసరఫరాలశాఖ సహకరించాలని ఆదేశించారు. రేషన్ షాపులు సక్రమంగా నిర్వహించడానికి గ్రామీణాభివృద్ధి, రెవెన్యూశాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. కొత్తగా రేషన్ షాపులు ఎక్కడెక్కడ ఏర్పాటు చేసిందీ లబ్ధిదారులకు తెలియజేసే దిశగా విస్తృత ప్రచారం చేయాలన్నారు. రేషన్ డీలర్ల సమ్మెతో తలెత్తే సమస్యలు, ఫిర్యాదుల కోసం 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మహిళా సంఘాలకు డీలర్ల బాధ్యతలు అప్పగించే క్రమంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జిల్లా స్థాయిలో జాయింట్ కలక్టర్లు, సబ్ డివిజన్ స్థాయిలో ఆర్డీఓలు, మండలస్థాయిలో తహసీల్దార్లు, గ్రామస్థాయిలో విఆర్‌ఓలకు పర్యావేక్షణ బాధ్యతలు అప్పగిస్తునట్టు కమిషనర్ తెలిపారు.
సమ్మె ఆగదు: డీలర్ల సంఘం
రేషన్ డీలర్లను సస్పెండ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై డీలర్ల రాష్ట్ర సంఘం తీవ్రంగా స్పందించింది. ఏమి చేసినా డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు స్పష్టం చేసారు. తమకు చెల్లించాల్సిన పాత బకాయిలను చెల్లించకపోగా డీలర్ షిప్‌లు రద్దు చేస్తామనడం విడ్డూరమని ఆయన విమర్శించారు. బంగారు తెలంగాణలో మా బతుకు లు బాగుపడుతాయనుకుంటే బజారున పడ్డాయని వాపోయారు. డీలర్లను భయ బ్రాంతులకు గురిచేస్తూ ప్రభుత్వ మొండివైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
చిత్రం..జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాలశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో
మాట్లాడుతున్న కమిషనర్ అకున్ సబర్వాల్