తెలంగాణ

ప్రజా సమస్యలను పట్టించుకోని కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, జూన్ 28: తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్, ప్రగతి భవన్‌లో కాలంగడుపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. లక్ష్మణ్ చేపట్టిన బీజేపీ జన చైతన్య యాత్ర గురు వారం షాద్‌నగర్‌కు చేరుకుంది. షాద్‌నగర్ బహిరంగ సభలో లక్ష్మణ్ మాట్లాడుతూ కేసీ ఆర్ ఫాంహౌజ్‌లో ఉంటూ ఎకరాకు లక్షల రూపాయల ఆదాయం వస్తుందని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అలాగే ప్రగతి భవన్‌లో ఉంటూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ కాలయాపన చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఎవరి పాలు అయిందో ప్రజలు గమనిస్తున్నారని లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో మూడు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, వాటిని భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభు త్వం నాన్చుడు ధోరణి అవలంభిస్తోందని బీజేపీ అధ్యక్షుడు విమర్శించారు. బతుకమ్మ పండుగకు కొనుగోలు చేసి చీరల్లో రూ.250 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపిం చిన లక్ష్మణ్ వెంటన దానిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధిస్తే పాలమూరు జిల్లాలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటు అన్ని విధాల అభివృద్ధి చేస్తానని చెప్పిన కేసీఆర్.. నేడు పట్టించుకోకపోవడం లేదన్నారు.పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించే వరకు కుర్చీ వేసుకొని కుర్చుంటానని చెప్పిన ఆయన నేటి వరకు శంకుస్థాపన చేయకపోవడంలో అంతర్యమేమిటో చెప్పాలని డిమాండ్ చేశా రు. రీడిజైన్ పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రజా సంక్షేమాన్ని పూర్తి గా విస్మరిస్తున్నారని లక్ష్మణ్ ధ్వజమెత్తారు.