తెలంగాణ

స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 28: సేవాదృక్పథంతో పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వ నిర్ణయిచినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి తెలిపారు. ఈ నిధులను సోషల్ వెల్పేర్ ఫండ్ నుంచి విడుదల చేస్తున్నట్లు ఆయన చెప్పారు. గురువారం సచివాలయంలో సిఎస్ అధ్యక్షతన సోషల్ వెల్పేర్ ఫంట్ స్టేట్ లెవల్ కమిటి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017-18 ఆర్థిక సంవత్సరానికి 17 స్వచ్ఛంద సంస్థలకు 50 శాతం నిధులకు బదులుగా 75 శాతం నిధులను విటుదల చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో పని చేస్తున్న అనాథ బాలలు, వృద్ధాశ్రమాలు, బుద్దిమాంద్య పిల్లలకు సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థల పనితీరును పరిశీలించిన అరంతరం ఆయా కేంద్రాలకు నిధులను విడుదల చేయనున్నట్లు చెప్పారు.స్వచ్ఛంద సంస్థల పనితీరుపై ఎప్పటికప్పడు అధికారులు పర్యవేక్షించాలని సిఎస్ సూచించారు. మేడ్చల్ జిల్లాలో-2, రంగారెడ్డి-5, నల్లగొండ- 3, నాగర్ కర్నూల్ -1, వరంగల్-1, ఆదిలాబాద్-1, మంచిర్యాల-1. పెద్దపల్లి-1 మహబూబ్‌నగర్ ఒకటి స్వచ్ఛంద సంస్థల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు ఆయన తెలిపారు.