తెలంగాణ

విద్యాసంస్థల పరిరక్షణకు పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 28: ప్రభుత్వ విద్య సంస్థలను రక్షించుకునేందుకు టీజేఎస్ విద్యార్ధి విభాగం ఆధ్వర్యలో ఈనెల 29న నాంపల్లిలోని కళాశాల కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనుంది. గురువారం నగరంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిని విలేఖరుల సమావశంలో పార్టీ నేతలు దిలీప్‌కుమార్, పీఎల్.విశే్వశ్వరరావులతో కలిసి ఆయన మాట్లాడారు. ఎయిడెడ్ విద్యా సంస్థల ప్రవేటీకరణ ఆపాలి, ఫీజుల నియంత్రణ చట్టాని తీసుకురావాలి, డిగ్రీ అడ్మిషన్లలో దోస్త్ విధానాన్ని రద్దు చేయాలి, కార్పోరేట్ విద్యా సంస్థలను నియంత్రించాలన్న డిమాండ్లతో ఈ ధర్నా కొనసాగుతుంది తెలిపారు. కేజీ టూ పీజీ విద్యను ఉచితంగా ఇస్తానని గద్దెనెక్కి కేసీఆర్ ఆ హామీని మరవడమే కాక ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఆశాజనకమైన మార్పులు వస్తాయని భావించినా ఆ దిశగా ఒక్క అడుగు వేయలేక పోయిందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే టీజేఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు.