తెలంగాణ

పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నూతనంగా నియమితులైన వెటర్నరీ అసిస్టెంట్‌లకు సూచించారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 462 మందికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అవకాశం రావడం ఎంతో అదృష్టమని అన్నారు. అందులోనూ పారిశ్రామికీకరణ జరుగుతున్న తరుణంలో మూగజీవాల కోసం పనిచేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం దేశంలోనే ఎక్కడా లేని విధంగా పశు సంపదను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యచరణతో ముందుకు సాగుతున్నామని అన్నారు. అందుకు వెటర్నరీ అసిస్టెంట్ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. పనిచేసే చోటే ఉండి మెరుగైన సేవలు అందించి ద్వారా రైతుల మెప్పు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, టీఎస్‌ఎల్‌డీఏసీ ఈ ఓ మంజువాణి, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్ పాల్గొన్నారు.