తెలంగాణ

అశ్రునయనాల మధ్య శరత్ అంత్యక్రియలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ క్రైం, జూలై 12: ఉన్నత చదువులకోసం అమెరికా వెళ్లి దుండగుల కాల్పుల్లో మృతి చెందిన కొప్పు శరత్‌కు గురువారం ఇక్కడ అశ్రునయనాల మధ్య అంత్య క్రియలు జరిగాయ. అక్కడికి వెళ్లిన ఆరు నెలలకే శరత్ మృతి చెందడాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేక పోతోంది. కాన్సస్ సిటీలోని ఓ రెస్టారెంట్‌లో గుర్తుతెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో శరత్ మృతి చెందిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం శరత్ మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో వరంగల్ కరీమాబాద్‌లోని వారి సొంతింటికి తీసుకువచ్చారు. అంబులెన్స్‌నుండి శరత్ మృతదేహంతో ఉన్న శవపేటికను కిందికి దింపుతుండగానే రోదనలు మిన్నంటుకున్నాయి. శరత్ తండ్రి రామ్మోహన్, తల్లి మాలతి, అక్క అక్షర శవపేటికపై పడి బోరున విలపించారు.
బంధువులు, స్థానికులు, శరత్ చిన్ననాటి స్నేహితులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. అంతేకాకుండా మృతుని తండ్రి రామ్మోహన్, తల్లి ఇద్దరు ఉద్యోగులు కావడంతో ఆయా శాఖలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు పసునూరి దయాకర్, గుండు సుధారాణి, స్థానిక ఎమ్మెల్యే కొండా సురేఖ, బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మా అమరేందర్‌రెడ్డి, అర్బన్, రూరల్ జిల్లా కలెక్టర్లు అమ్రపాలి, హరిత, ఆర్డీవో మహేందర్‌జీ చేరుకున్నారు.
శరత్‌కు నివాళు లర్పించారు. శరత్ తల్లిదండ్రులను, అక్కను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని డిప్యూటీ సీఎం కడియం ఓదార్చారు. మధ్యాహ్నం 12గంటలకు శరత్ అంత్యక్రియలు ప్రారంభమయ్యాయ. తండ్రి రామ్మోహన్ కొడుకు శరత్‌కు తలకొరివి పెట్టడంతో కరీమాబాద్ కన్నీటి సంద్రంగా మారిపోయింది.

చిత్రాలు....శరత్ తండ్రిని ఓదారుస్తున్న డిప్యూటీ సీఎం కడియం, నివాళులు అర్పిస్తున్న రూరల్ కలెక్టర్ హరిత