తెలంగాణ

ఎలాంటి ఆందోళనలు నిర్వహించారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: ప్రజా సమస్యలపై ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు?, పోలింగ్ కేంద్రాల వారీగా కమిటీల నియామకాలు ఎంత వరకు వచ్చాయి? అని తెలంగాణకు నియమితులైన ఎఐసిసి కార్యదర్శి సలీం అహ్మద్ అసెంబ్లీ సమన్వయకర్తలను ప్రశ్నించారు. శనివారం అహ్మద్ మహబూబ్‌నగర్, నాగర్ కర్నూలు, నల్లగొండ, భువనగిరి, మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గాల పరిథిలోని ముఖ్య నాయకులతో సమావేశమై చర్చించారు. పిసిసి తరపున ఒక్కో అసెంబ్లీకి నియమించిన సమన్వయకర్తలతోనూ మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల వారీగా కమిటీల నియామకం ఎంత వరకు వచ్చింది?, ఆశావాహుల వ్యవహార శైలి ఏ విధంగా ఉంది?, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారా?, ప్రజల్లో తిరుగుతూ వారి సమస్యలపై పోరాటాలు చేస్తున్నారా?, ప్రజలను భాగస్వాములుగా చేస్తున్నారా? అని ఆయన వారిని అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో ఆయన వారికి పలు సూచనలు చేశారు.