తెలంగాణ

ఉపాధి హామీ నిధులను వినియోగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించనున్న హరితహారం కార్యక్రమానికి జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా) నిధులను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా డిపీఆర్‌లను సిద్ధం చేయాలన్నారు. ఆదివారం ప్రగతిభవన్‌లో గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టనున్న హరితహారం కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే.జోషి, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డిలు పాల్గొన్నారు. గతంతో పోల్చితే గ్రామాల స్వరూపం పూర్తిగా మారిపోతున్నాయని, పట్టణాల్లో మాదిరిగానే గ్రామాల్లో పచ్చదనం తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో పల్లెల్లో తిరిగి పచ్చదనం సంతరించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వడం నుంచి పెరిగి పెద్దవి అయ్యే వరకు మానవ శ్రమ ఎంతో అవరం ఉన్నందున ఉపాధి హామీని ఈ కార్యక్రమానికి అనుసంధానం చేయాలని సూచించారు. ఇటు ఉపాధి పథకం లక్ష్యంతో పాటు హరితహారం లక్ష్యం సైతం నెరవేరుతోందని అన్నారు.
నర్సరీల్లో 25శాతం పండ్ల మొక్కలు..
ప్రతి గ్రామంలో నర్సరీలు తప్పని సరిగా ఏర్పాటు చేసేలా చూడాలని ఆదేశించారు. నూతనంగా ఏర్పడ్డ గ్రామాలతో కలుపుకొని 12,751 గ్రామాలు ఉన్నాయని, లక్ష్యాలకు అనుగుణంగా ఆయా గ్రామాల్లో మొక్కలు నాటి వాటి పరిరక్షణకు పెద్ద పీఠవేయాలన్నారు.
25శాతం పండ్ల మొక్కలు ఉండేలా చూడాలని, దీని ద్వారా ఆయా గ్రామాల్లో పచ్చదనం పెరగడంతో పాటు పశు, పక్షాదులకు ఆహారం సైతం లభిస్తోందన్నారు. ముఖ్యంగా కోతుల బెడదను తగ్గించేందుకు పండ్ల గ్రామాల సమీపంలోని అడవుల్లో తునికి, ఎలక్కాయ, మొర్రి, నేరేడు, సీతఫల, జామ తదితర మొక్కలను నాటి వాటికి రక్షణ కల్పించాలని సూచించారు.

చిత్రం..ప్రగతిభవన్‌లో ఆదివారం హరితహారం కార్యక్రమంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్