తెలంగాణ

తప్పులతడకగా భూరికార్డుల ప్రక్షాళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, జూలై 22: టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లు మిన్నకుండి హడావుడిగా రైతు బంధు కోసం భూరికార్డుల ప్రక్షాళనకు పూనుకుందని, భూరికార్డుల ప్రక్షాళన అంతా తప్పుల తడకగా మారిందని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రైతులకు దశాబ్దాల తరబడి సంప్రదాయం గా వస్తున్న హక్కులను నేడు రైతుబంధు కారణంగా కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నర్సంపేట జన సమితి కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడారు. భూరికార్డుల ప్రక్షాళన జూన్ 30వ తేదీ వరకు పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా నేటికీ ఏ గ్రామం లోనూ పూర్తి స్థాయిలో అమలు కాలేదన్నారు. నలభై శాతం మంది రైతులకు పాసు పుస్తకాలు, పంట చెక్కులు అందలేదని వాపోయారు.
అదేవిధంగా పాసు పుస్తకాలు ఇచ్చిన రైతుల పుస్తకాలలో ఏదో ఒక లోపం ఉంటూనే ఉందన్నారు. సేత్వార్, పట్టాదారు పుస్తకాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సరి చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. గతంలో కాస్తు దారు లో ఉన్న రైతులకు అన్ని రకాల హక్కులు ఉండేవని, గత హక్కులను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల పంట రుణం, బీమా అందకుండా పోయే పరిస్థితి నెలకొందన్నారు. రైతుబంధు రాకపోవడంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట చెక్కు, పాసు పుస్తకం, రైతుకు భూమిపై హక్కు కోసం సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట రైతు దీక్ష కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. అనంతరం ప్రభుత్వ అధికారులను కలిసి భూరికార్డుల ప్రక్షాళనపై నివేదిస్తామని తెలిపారు. అయినా ప్రభుత్వం సమస్య పరిష్కరించకపోతే సెప్టెంబర్‌లో తమ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
రాబోయే రోజులలో యువత, రైతుల సమస్యల పరిష్కారం కోసం జన సమితి ఉద్యమించనుందన్నారు. ప్రజలు కేంద్రం గా ప్రజలను కదిలించి జన సమితి రాజకీయాలు చేయనుందని అన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమం, జయప్రకాశ్‌నారాయణ ఆధ్వర్యంలో సాగిన ఉద్యమం, తొలితరం కాంగ్రెస్ నాయకులు సైతం ప్రజలే కేంద్రంగా ఉద్యమించారని చెప్పారు. ఈనాడు నాయకులే కేంద్రం గా రాజకీయాల నడుస్తున్నాయని వాపోయారు. ప్రజలను కదిలించి రాజకీయాలు చేస్తేనే సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణ జన సమితి ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఇందులో ఎవరికి ఎలాంటి సందేహం లేదన్నారు. ఇదే సమయంలో ముందస్తు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవటానికి జన సమితి సిద్ధంగా ఉందన్నారు. అదే విధంగా గ్రామాలలో పార్టీ నిర్మాణాలు, సభ్యత్వాల కార్యక్రమం జోరుగా సాగుతుందని వివరించారు. సమావేశంలో తెలంగాణ జన సమితి నాయకులు షేక్ జావీద్, బొనగాని రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ప్రొఫెసర్ కోదండరాం