తెలంగాణ

12 నెలల వేతనం ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 9: కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసులను రెగ్యులరైజ్ చేసేంత వరకూ ఏటా 12 నెలల వేతనాన్ని ఇవ్వాలని, అలాగే రెగ్యులరైజేషన్‌కు సంబంధించి న్యాయస్థానాల్లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు లెకర్చరర్ల సంఘం నేతలు కొప్పిశెట్టి సురేష్, సయ్యద్ జబీఉల్ల డిమాండ్ చేశారు. కాంట్రాక్టు లెక్చరర్ల ఉద్యోగ భద్రత సాధనకు ఈ నెల 11న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్టు వారు చెప్పారు. ఈ సదస్సులో టీఎస్‌జీసీసీఎల్‌ఎ అసోసియేట్ అధ్యక్షుడు కేపీ శోభన్‌బాబు, అధ్యక్షుడు జీ రమణారెడ్డి, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్, డాక్టర్ అందె సత్యం హాజరవుతారని వారు పేర్కొన్నారు.