తెలంగాణ

అణగారిన వర్గాలకు కేంద్రం ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 9: కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ చట్టానికి మరింత పదను పెట్టడం ద్వారా అట్టడుగు అణగారిన వర్గాలకు కేంద్రప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టమైందని ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో మార్పులు తీసుకువచ్చి మరింత పటిష్టవంతంగా చేయడంతో పాటు బీసీ కమిషన్‌కు రాజ్యాంగ బద్ధత కల్పించడంపై బీజేపీ నేతలు ట్యాంకుబండ్‌పై ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా రామచందర్‌రావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన సవరణలకు బీజీపీకి ఏ సంబంధం లేకపోయినా ప్రతిపక్షాలు బీజేపీపై నిందలు మోపాయని ఆరోపించారు. సవరణల ద్వారా ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని మరింత పటిష్టంగా అమలుచేసేందుకు కేంద్రం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు.