తెలంగాణ

కంప్యూటర్ మార్గనిర్దేశంతో దంత సంరక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: కంప్యూటర్ మార్గనిర్దేశంతో మరింత మెరుగైన దంత సంరక్షణ చేయవచ్చని పోర్చుగల్ అపొర్టో యూనివర్సిటీకి చెందిన ప్రపంచ ప్రఖ్యాతి చెందిన డెంటల్ సర్జన్ ప్రొఫెసర్ పౌల్ కార్వాలో తెలిపారు. శుక్రవారం నగరంలో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులకు ప్రొఫెసర్ పౌల్ కార్వాలో దంత సంరక్షణకు సంబంధించి వచ్చిన తాజా పరిణామాలపై వారికి అవగాహన కలిగించారు. అనంతరం ఇండియన్ డెంటల్ అసోసియేషన్ డెక్కన్ బ్రాంచ్ అధ్వర్యంలో ఏర్పాటైన విలేఖరుల సమావేశంలో ప్రొఫెసర్ పౌల్ కార్వాలో డెక్కన్ బ్రాంచ్ సెక్రటరీ డాక్టర్ ఎ. శ్రీకాంత్‌తో కలిసి మాట్లాడుతూ దంత సంరక్షణలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని తెలిపారు. ‘కంప్యూటర్ గైడెడ్ ఇంప్లాంట్ సర్జరీ’తో దంత సంరక్షణ అనేది ప్రస్తుతం ఎంతో పురోభివృద్ధిని సాధించిందని వివరించారు. ఇంతకు ముందు వరకూ చికిత్సను మాన్యువల్ అందించే వారని, తద్వారా వివిధ దంత వ్యాధులను నిర్ధారించడానికి, వాటికి చికిత్సను అందించేందుకు శస్త్ర చికిత్సా నిపుణులు తమ వివేచన, అనుభవంపై ఎక్కువగా ఆధారపడేవారని అన్నారు. ఇది తరచూ అసంపూర్ణమైనటువంటి చికిత్సకు దారి తీసేదని, వ్యాధి నిర్ణారణకు ఇది తగిన విధంగా లేకపోవచ్చని అన్నారు. ఫలితంగా సమగ్రమైన చికిత్సను అందించడానికి అనేక సెషన్లు అవసరమయ్యేదని, అదే సమయంలో రోగి సుదీర్ఘమైన చికిత్సా సెషన్లను, తత్పలితంగా తీవ్రమైన అసౌకర్యాలను ఎదుర్కొవాల్సి వచ్చేదని వివరించారు.