తెలంగాణ

ఫ్లైఓవర్లకు భూములు ఇవ్వడానికి కేంద్రం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: ఫ్లైఓవర్లకు రక్షణ భూములు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని హెచ్‌ఏఎల్ డైరెక్టర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్ -సుచిత్ర, సికింద్రాబాద్ -తూంకుంట ఫ్లైఓవర్లకు సంబంధించి రక్షణ శాఖకు చెందిన భూముల బదలాయింపుపై టీఆర్‌ఎస్ నేతలు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఫ్లైఓవర్లు, రోడ్లు వెడల్పు, బ్రిడ్జీల నిర్మాణం, ఎంఎంటీఎస్ తదితర అవసరాలకు రక్షణ శాఖ భూములు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నా, ప్రభుత్వం సెక్రటేరియట్ కోసం, జింఖానా బైసన్‌పోలో మైదానానికి లింకు పెట్టడం వల్లే ఆలస్యం జరుగుతోందని అన్నారు. రాజధానిలో ఇప్పటికే క్రీడాస్థలాలు, పార్కులు, ఖాళీ స్థలాలు సరిపోయేంత లేవని, ఎంతో మంది క్రీడాకారులకు ఉపయోగపడే జింఖానా, బైసన్‌పోలో మైదానాల్లో నిర్మాణాలు చేపట్టాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వం భావించడం మూర్ఘత్వమని మల్లారెడ్డి అన్నారు. సెక్రటేరియట్ కోసం నూతన భవనం అవసరం లేదని, జింఖానా, బైసన్‌పోలో మైదానాలు కాపాడాలని పలు సంస్థలు, సంఘాలు నగర ప్రముఖులు రక్షణ శాఖకు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు కూడా వేశారని, ఇవన్నీ ఉండగా కేంద్రంపై నిందలు వేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మోకాలికీ బోడిగుండుకూ లింకుపెట్టినట్టు ప్రభుత్వం ఫ్లైఓవర్లు, సచివాలయానికి ఎందుకు లింకు పెట్టింది ఎవరని అన్నారు. సచివాలయానికి సంబంధం లేకుండా కేవలం రోడ్లు ఫ్లైఓవర్ల కోసమే రక్షణ భూములు అడిగిన పక్షంలో రక్షణ శాఖ భూములు ఇవ్వడం సాధ్యం అవుతుందని చెప్పారు.