తెలంగాణ

అది చట్టవిరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ ‘ఎ’ జాబితాలోని ఆదివాసీ, విముక్త సంచార జాతులు, అర్ధ సంచార, అర్ధ నివాస జాతులను ఎంబీసీలుగా ప్రకటిస్తూ జివో నెం.16ను విడుదల చేసిందని సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. బీసీ కమిషన్‌ను పక్కన పెట్టి ప్రభుత్వమే జాబితాలు ప్రకటించడం చట్ట విరుద్ధమని ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంచార జాతులను ప్రత్యేక కేటగిరిగా చూపించడం లేదా ఎంబీసీ-1లో ఎంబీసీ కులాలు, ఎంబీసీ-2లో సంచార జాతులను చేర్చితే న్యాయంగాను, సందిగ్ధతలు తొలిగే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. అదేవిధంగా గుర్తింపునకు నోచుకోని 23 సంచార జాతులను గుర్తించి, ఎబిసిడి జాబితాల్లోని అన్ని సంచార జాతులను ఒకేచోట చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా అనాథలను ఎంబీసీలో ఏర్చడం మరో వివాదానికి తావిచ్చినట్లు అయ్యిందని, ఇందులో ఎంబీసీ అంటే ఎవరనే హేతుబద్ధత, స్పష్టత లోపించిందని ఆయన తెలిపారు. కాబట్టి దీనిపై ప్రత్యేక కమిషన్ లేదా బీసీ కమిషన్‌కు అప్పగించి, శాస్ర్తియమైన పద్ధతుల ద్వారా సమగ్ర విధానాన్ని రూపొందించాలని వీరభద్రం కోరారు.