తెలంగాణ

ఫార్మాలిటికా-2018 ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: ఫార్మాస్యూటికల్ రంగంలో నాణ్యత హామీ, సాంకేతికత, నాణ్యత సంస్కృతి, రెగ్యులేటరీ, కాంప్లియెన్స్ ప్రమాణాలకు సంబంధించి తాజా ధోరణులను ఫార్మాలిటికా ప్రదర్శించింది. హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో శుక్ర, శనివారాల్లో (10, 11న) నిర్వహించింది. ఈ రెండు రోజుల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డ్రగ్స్ కంట్రోలు అడ్మినిస్ట్రేషన్ అధికారి డాక్టర్ ప్రీతి మీనా ప్రారంభించారు. ఫార్మా ఎక్సెల్ మాజీ చైర్మన్, అరబిందో ఫార్మా లిమిటెడ్ డైరెక్టర్ మదన్‌మోహన్ రెడ్డి, ఫార్యాస్యూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (్ఫర్మ్‌ఎక్సిల్) డైరెక్టర్ జనరల్ ఉదయ్‌భాస్కర్ రెడ్డి, ఫార్మాస్యూటికల్స్ ఎక్స్‌పోర్టు ప్రమోషన్ కౌన్సిల్ (్ఫర్మ్‌ఎక్సిల్) డైరెక్టర్ జనరల్ ఎమిర్టస్ డాక్టర్ పివి అప్పాజీ, యూబీఎం ఇండియా గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ యోగేశ్ ముద్రాస్, యూబీఎం ఇండియా గ్రూపు డైరెక్టర్ రాహుల్ దేశ్ పాండే గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఫార్మాస్యూటికల్ కమ్యూనిటీ తాజా పరిశ్రమ ధోరణులు, వినూత్నతలు తెలుసుకునేందుకు, అనలిటికల్, లేబోరేటర్, మెషినరీ, ప్యాకేజింగ్ ఇతర అనుబంధ పరిశ్రమలతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు ఈ ప్రదర్శన వీలు కలుగుతుందని ముఖ్యఅతిథులు ప్రశంసించారు.