తెలంగాణ

త్వరలో హైదరాబాద్ దిగ్బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నిలబెట్టుకోనందున అతి త్వరలో రెండు లక్షల మంది నిరుద్యోగులతో హైదరాబాద్‌ను దిగ్బందం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. తెలంగాణ నిరుద్యోగ జేఎసీ అధ్వర్యంలో శనివారం ఆంధ్ర విద్యాలయం ప్రాంగణంలో జరిగిన సమావేశానికి ఆర్. కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణయ్య ప్రసంగిస్తూ తెగించి పోరాడకపోతే ఉద్యోగాలు రావని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. తెలంగాణ ఉద్యమం సమయంలో చూపించిన తెగింపు, సాహసం ఇప్పడు ఏమైందని ఆయన నిరుద్యోగులను ప్రశ్నించారు. అక్టోబర్‌లో రెండు లక్షల మంది నిరుద్యోగులతో హైదరాబాద్ దిగ్బంధం చేసి ప్రభుత్వంపై వత్తిడి తెద్దామని కృష్ణయ్య అన్నారు. ఈ మహా సభకు నీల వెంకటేష్, గుజ్జ కృష్ణ అద్యక్షత వహించారు. కార్యక్రమంలో ఎర్ర సత్యనారాయణ, వేముల రామకృష్ణ, ముది మాణిక్యం, మహేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చిక్కుళ్ళ
బీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ కార్యనిర్వాహక అధ్యక్షునిగా చిక్కుళ్ళ శివ ప్రసాద్‌ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య నియమించారు.