తెలంగాణ

కీళ్ళ మార్పిడిలో అధునాతన పద్ధతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 12: కీళ్ళ మార్పిడి (కార్టిలేజ్ రీ-ప్లేస్‌మెంట్, హాఫ్ నీ)కి అద్భుతమైన నూతన పద్ధతులు అందుబాటులోకి రావాల్సి ఉందని అర్థోపెడిక్ డాక్టర్లు అభిప్రాయపడ్డారు. అపోలో హాస్పిటల్స్ అధ్వర్యంలో తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్ల అసోసియేషన్ (టిఒఎస్‌ఎ), ట్విన్ సిటీస్ ఆర్థోపెడిక్ సొసైటీ (టిసిఒఎస్) సంయుక్త సహకారంతో ఆదివారం నగరంలోని ఒక హోటల్‌లో 3వ అర్థ్రోప్లాస్టీ, అర్థ్రోస్కోపి సమ్మిట్ (ఎఎఎస్) జరిగింది. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్, సీనియర్ అర్థో అండ్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ మిథిన్ అచి, చెన్నయ్ సిమ్స్ హాస్పిటల్ కో-డైరెక్టర్ డాక్టర్ విజయ సి బోస్, చెన్నయ్ అపోలో హాస్పిటల్స్ డాక్టర్ నవలాది శంకర్, ముంబాయ్‌లోని జస్‌లోక్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ గౌరేష్ పాలీకర్‌లు మీడియాతో మాట్లాడుతూ కార్టిలేజ్ రీప్లేస్‌మెంట్, హాఫీ నీ (మోకాలి) రీప్లేస్‌మెంట్ గురించి సదస్సు ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించినట్లు చెప్పారు. కార్టిలేజ్ (మృథులాస్థి)కు పగుళ్లు ఏర్పడడం లేదా దానికి గాయమైన సందర్నాలలో కార్టిలేజ్‌ను తిరిగి భర్తీ చేయడం అనే తాజా ఎంపిక ఇప్పుడు అందుబాటులో ఉన్నదని వారు తెలిపారు.
కార్టిలేజ్ అనేది కీళ్ళు కలిసే చోట రెండు ఎముకల మధ్య ఉండి ఒక కుషన్‌లా పని చేసుందని వారు చెప్పారు. అది లేకపోతే కదలిక సమయంలో ఎముకలు ఒకదానితో ఒకటి ఒరిపిడికి గురవుతాయని, తద్వారా నొప్పి కలుగుతుందన్నారు. ఈ సదస్సులో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 150 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారని వారు తెలిపారు. ఈ సదస్సు యువ అర్థోపెడిక్ సర్జన్లు మరిన్ని మెళుకువలు నేర్చుకోవడానికి ఎంతో ఉపయోగపడిందని వారు వివరించారు.

చిత్రం..3వ అర్థ్రోప్లాస్టీ, అర్థ్రోస్కోపి సమ్మిట్ కార్యక్రమానికి హాజరైన డాక్టర్లు