తెలంగాణ

లింగంపల్లి ప్రాజెక్టుపై గ్రామస్థుల అభ్యంతరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 12: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధిలోని లింగంపల్లిలో ప్రభుత్వం నిర్మించితలపెట్టిన రిజర్వాయర్‌ను ఆ గ్రామస్థులు అంగీకరించడం లేదు. ఆదివారం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, స్ధానిక ఎమ్మెల్యే రాజయ్య, జనగామ జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, దేవాదుల చీఫ్ ఇంజనీర్ బంగారయ్యలు లింగంపల్లి గ్రామస్తులతో రిజర్వాయర్ నిర్మాణంపై గ్రామస్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. లింగంపల్లి గ్రామస్థుల అభిప్రాయం, అంగీకారం మేరకే ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి గ్రామస్థులకు హామీ ఇచ్చారు. మీ అభిప్రాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. లింగంపల్లి- మల్కాపురం వద్ద 10.78 టిఎంసీల రిజర్వాయర్ నిర్మాణం కోసం 3220 కోట్ల రూపాయలతో పరిపాలనా అనుమతులు వచ్చిన నేపథ్యంలో లింగంపల్లి గ్రామస్థుల అభిప్రాయం తెలుసుకునేందుకు తాము ఇక్కడికి వచ్చామని గ్రామస్తులకు నచ్చచెప్పెప్రయత్నం చేసిన గ్రామస్థులు మాత్రం రిజర్వాయర్ నిర్మాణానికి అంగీకించలేదు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడుతాయని సంబరపడితే ఇప్పుడు ప్రాజెక్టుల పేరుతో మమ్ముల్ని మంచుతాం అంటే అంగీకరించమని చెప్పారు. గ్రామస్థులు అభిప్రాయాలు, ఆవేదన విన్న తర్వాత ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ లింగంపల్లి గ్రామస్తుల అంగీకారం, అభిప్రాయం మేరకే ప్రాజెక్టుపై నిర్ణయం ఉంటుందని అన్నారు. నమ్ముకున్న గ్రామాన్ని, నమ్ముకున్న భూములను వదిలిపెట్టి వెళ్లాలంటే బాధతో కూడుకుందే అని, మీ బాధను నేను అర్ధం చేసుకోగలను చెప్పారు. ఏదైనా పనిచేస్తే పదిమందికి ఉపయోగపడాలని ఆలోచించే వాడనే తప్ప మోసం చేసేవాడిని కాను అని అన్నారు. నేను రాజకీయాలకు వచ్చినప్పటినుంచి అనేక ఎన్నికల్లో పోటీ చేసినప్పడు గెలిచిన.. ఓడిన మెజారిటీ ఓట్లు ఇచ్చింది మాత్రం ఈ లింగంపల్లి గ్రామమే అని అన్నారు. అందుకే ఈ గ్రామాన్ని కన్నతల్లి అని చెప్పుకొచ్చారు. కన్నతల్లికి ద్రోహం చేసే వ్యక్తిని కాను. మీకు ద్రోహం చేయాలనుకుంటే ఇక్కడకు వచ్చే వాడిని కాను, మీతో మాట్లాడేవాడని కాను అని చెప్పారు. ఇక్కడికి రాకుండానే చేసే పనిని చేసేవాడిని, నమ్ముకున్న వారిని మోసం చేయడం తన నైజం కాదు. మీరందరూ ఏకగ్రీవంగా రిజర్వాయర్ వద్దు అన్నారు. మమ్ముల్ని ముంచి వేరే వారికి న్యాయం చేయాల్సిన అవసరం లేదన్నారు. మన వరంగల్ జిల్లాలో పెద్ద రిజర్వాయర్ లేదు. చిన్నచిన్న రిజర్వాయర్లు ఉన్నాయి. మన వరంగల్ జిల్లాలో కూడా పెద్ద ప్రాజెక్టు కాట్టాలని ముఖ్యమంత్రిని అడిగినప్పుడు నీటి పారుదల శాఖ అధికారులను సర్వే చేయమన్నారు. వారు గీసుగొండ, మైలారం, స్టేషన్‌ఘన్‌పూర్, గండి రామారం రిజర్వాయర్లు సర్వేచేశారు. కాని ఇవన్నీ పరిశీలించిన తర్వాత తక్కువ ముంపుతో ఎక్కవ నీటిని నిల్వ చేసుకునే అవకాశం మల్కాపురం, లింగంపల్లి మధ్య ఉందన్నారు. దాని ప్రకారం నివేదిక ఇచ్చారు. ఒక వేళ ప్యాకేజీ గురించి సీఎం చెపితే మీగ్రామ కమిటీలతో ఒకటికి పదిసార్లు కూర్చోని మాట్లాడుతాం, పర్వాలేదు మీము ఒప్పుకుంటామని అంటేనే పనిచేస్తాం తప్ప లేకపోతే చేయం అని డీప్యూటీ సీఏం తెలిపారు. లింగంపల్లి గ్రామస్థులకు ద్రోహం చేసి రాజకీయం చేయాల్సిన అవసరం లేదని కడియం అన్నారు. లక్ష మందికి ఉపయోగపడుతున్నప్పుడు రాజకీయంగా ఆలోచించడం తప్ప తనకు వేరే ఉద్దేశ్యం లేదన్నారు.