తెలంగాణ

మొక్కజొన్నకు ‘విదేశీ’ తెగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, ఆగస్టు 21: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి, సిరిసిల్ల, ఇల్లంతకుంట మండలాలలో ‘్ఫల్ ఆర్మీవామ్ రకం’ (కత్తెర పురుగు) ఆనవాళ్లు వెలుగు చూశాయి. తెలంగాణలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ కత్తెర పురుగు శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ కీటకం మొక్కజొన్న పంటను ధ్వంసం చేస్తున్నట్టు వ్యవసాయ సీనియర్ శాస్తవ్రేత్త డా. విజయకుమార్, జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్ కుమార్‌రెడ్డి మంగళవారం బోయినిపల్లి మండలం వర్థవెల్లి, జగ్గారావుపల్లె, తంగళ్లపల్లి మం డలం చిన్నలింగాపూర్, ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్, దాచారం గ్రామాలలో గుర్తించారు. ఈ సందర్భంగా మొక్కజొన్న ఇతర పంటలు సాగు చేస్తున్న రైతులను అప్రమత్తం చేసేందుకు సిరిసిల్ల పట్టణంలోని ఆర్ అండ్‌బీ అతిథి గృహంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. కత్తెర పురుగు వ్యాప్తి పురుగు సోకినట్టు గుర్తింపు, నివారణకు తీసకోవాల్సిన చర్యలను వ్యవసాయ సీనియర్ శాస్తవ్రేత్త డా.విజయకుమార్ వివరించారు. ఈ పురుగు సోకిన మొదటి దశలో గుర్తించకపోతే నష్టం భారీగానే ఉంటుందన్నారు. ఈ కీటకం పంటను కత్తిరించేస్తుందని, అందుకే ఫాల్ ఆర్మీ వామ్‌ను కత్తెర పురుగు గానూ వ్యవహరిస్తారన్నారు. అమెరికాకు సుపరితమైన ఈ జీవి.. రాజన్న సిరిసిల్లతో పాటు వివిధ జిల్లాల్లో శరవేగంగా వ్యాపిస్తోందని చెప్పారు. వివిధ జిల్లాల్లో మొదటి, రెండో దశలోనే ఉందన్నారు. ఒక్కో పురుగు 1000 నుంచి 1500 గుడ్లు పెడుతుందన్నారు. ఈ పురుగు మొక్కజొన్న పంటపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందని, ఈ పురుగు లేత మొక్కలను రంధ్రాలు చేసి నివసిస్తుంటుందన్నారు. వాటి ఎదుగుదలను నిలిపి వేస్తుందన్నారు. మక్క కంకినే కాదు బెండును కూడా ఆర్మీ వామ్ పిప్పి చేస్తుంటుందని, ఫలితం గా దిగుబడి తగ్గి రైతులకు నష్టాలే వస్తాయని, మొక్క జొన్న పంటను ఒక్కసారి ఈ పురుగు ఆశిస్తే వదిలిపోదన్నారు. ఈ నష్టం మొక్క జొన్నతోనే ఆగిపోదన్నారు. ఈ పంట అందుబాటులో లేపుడు వరి, చెరకు, కూరగాయల పంటలను ఆశించి నాశనం చేస్తుందని, దీనితో మొక్క జొన్న రైతుల్లోనే కాక ఇతర పంటలు పండిస్తున్న రైతులు జాగ్రత్త పడాలన్నారు. పంటలను దారుణంగా దెబ్బతీసి కత్తెర పురుగును తొలి దశలో గుర్తించి క్రిమినాశినిలను పిచికారీ చేస్తే సులభంగా కంట్రోల్ చేయవచ్చన్నారు. ఈ సందర్భంగా జిల్లా రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ గడ్డం నర్సయ్య మాట్లాడుతూ జిల్లాలోని మండల, గ్రామ రైతు సమన్వయ సమితి సభ్యులు కత్తెర పురుగుపై అప్రమత్తంగా ఉండాలన్నారు.

చిత్రం..ఇటీవల మక్క పంటలకు సోకుతున్న ఆర్మీ వామ్ పురుగు (కత్తెర పురుగు)