తెలంగాణ

రైతులను రెచ్చగొట్టేందుకు కాంగ్రెస్ యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఆగస్టు 21 : కాంగ్రెస్ పార్టీ కుట్రలు భగ్నమైనాయని, నిజమాబాద్ రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకున్న కాంగ్రెస్ నాయకులకు, ప్రతిపక్షానికి వరుణ దేవుడు సరైన బుద్ధి చెప్పాడని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పద్మనాయక్ ఫంక్షన్ హాల్‌లో పాడి పశువుల పంపిణీపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ వరుణదేవుడు సైతం టీఆర్‌ఎస్ పార్టీ వైపు ఉన్నాడని, మంచిచేసే వారివైపు దేవుడు ఉంటాడన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున వర్షాలు కురవటం వల్ల ఎస్‌ఆర్‌ఎస్పీలోకి 2.50,000 వేల క్యూసెక్కుల వరద నీరువస్తోందన్నారు. కాకతీయ, లక్ష్మీ, సరస్వతి కాల్వలకు, గుత్ప అలీసాగర్ ప్రాజెక్టులకు నీళ్లు వదిలి పెట్టాలని ఈరోజే ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టులకు నీరు వదిలిపెట్టామని సమాచారంతో రైతులంతా ఆనందిస్తుంటే కాంగ్రెసోళ్లు ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. వరుణ దేవుడు కటాక్షించి పుష్కలంగా వర్షాలు కురిపించి తెలంగాణాను ఆశీర్వదించిండన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోవటానికి కాంగ్రెసోళ్లు గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు వేశారన్నారు. ఈ కేసులను సైతం ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్ కొట్టివేసినట్లు తెలిపారు. ఈరోజు రెండు శుభవార్తలతో మనస్సుకు ఎంతో సంతోషం వేసిందన్నారు. ఒకటి పోచంపాడుకు నీళ్లు వస్తున్నాయని, మరొకటి కేసులు కొట్టివేయటమన్నారు.
20వేల మంది రైతులకు పాడి పశువులు
సిద్దిపేట జిల్లా పరిధిలో 130 కోట్లతో 20వేల మంది రైతులకు పాడిపశువులు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. రైతులు తమకు నచ్చిన పశువులు, నచ్చిన చోట తెచ్చుకోవచ్చన్నారు. అంతిమంగా పాల ఉత్పత్తి పెరగాలని, రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పాడి అభివృద్ధి జరిగితే సేంద్రియ ఎరువులు సైతం రైతుకు లభిస్తాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులు అడగకుండానే అన్ని చేస్తున్నాడని, రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో బ్లూ, పింగ్, వైట్ రీవెల్యుషన్లకు సీఎం కేసీఆర్ నాంది పలికినట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో చెప్పినవి అమలు చేస్తునే, ఇవన్నీ హామీలు సైతం అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఇప్పుడు ప్రజల వద్దకు వస్తున్నారని అమలుకాని హామీలు ఇస్తున్నారని విమర్శించారు. 2009లో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన ఒక్క హామీనైనా అమలు చేశారా? అని ప్రశ్నించారు. మొక్కజొన్న పంటకు కొత్త తెగులు వచ్చిందన్నారు. ఇది విదేశాల నుండి వచ్చిందని ఇది ఒక్క రోజులోనే వంద కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులు దశాబ్దాల పాటు కడితే టీఆర్‌ఎస్ సర్కార్ కాళేశ్వరం లాంటి బృహత్తర ప్రాజెక్టును అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల పూర్తి చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఆనంరతం లబ్ధిదారులకు పాడిపశువుల పంపిణీ పత్రాలను అందచేశారు. ప్రభుత్వ చీఫ్‌విప్ వెంకటేశ్వర్లు, కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, దుబ్బాక, హుస్తాబాద్ ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, సతీష్, పశుసంవర్థక శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

చిత్రం..లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేస్త్తున్న మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యేలు