తెలంగాణ

ఉత్తమ్‌తో బ్రిటీష్ అధికారుల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: బ్రిటీష్ కమిషనరేట్ అధికారులు టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. మంగళవారం గాంధీ భవన్‌కు వచ్చిన బ్రిటీష్ మినిస్టర్ కౌన్సిల్ పొలిటికల్, ప్రెస్ విభాగాల ప్రతినిది కైరెన్ డ్రాకె, బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ అండ్రూస్ ప్లీమింగ్‌కు చేరుకోగానే టీ.పీసీసీ కోశాధికారి గూడురు నారాయణ రెడ్డి వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఛాంబర్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు రాష్ట్రంలోని తాజా రాజకీయ అంశాలు, కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, సామాజిక, ఆర్థిక స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు.
నరుూం కేసు ఏమైంది?
ఇలాఉండగా ఎఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి. హనుమంత రావు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు గ్యాంగ్‌స్టర్ నరుూం కేసులో నిందితులను ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటి వరకు జరిపిన విచారణలో వెల్లడైన వారి పేర్లను ప్రజలకు తెలియజేయాలని వీహెచ్ సీఎంను డిమాండ్ చేశారు.