తెలంగాణ

తెలంగాణ వ్యవసాయం దేశానికే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, సెప్టెంబర్ 4: వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం భారతదేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, వ్యవసాయ రంగాన్ని ఆధునీకరణ యాంత్రీకరణతో లాభసాటిగా మార్చాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో వరి నాట్లు వేసే పద్దతుల్లో ఆధునిక సాంకేతిక యాత్రీకరణ విధానంపై ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇతర దేశాల నుండి వరి నాట్లు నాటే యంత్రాల దిగుమతి చేసుకున్నాం అని తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల్లో వరి పంట వేశారన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా ఉంచాలనే లక్ష్యంలో భాగంగానే ఆధునిక పరికరాలతో వ్యవసాయ యాంత్రీకరణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కోటీ 8లక్షల ఎకరాల విస్తీర్ణంలో 25 లక్షల ఎకరాల్లో వరి, 50 లక్షల ఎకరాల్లో పత్తి, 10 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, లక్షల ఎకరాల కంది, 5 లక్షల ఎకరాల్లో సోయా, 4లక్షల ఎకరాల్లో పెసర, రెండు లక్షలలో మినుము, లక్షా ఎకరాల్లో జొన్న, మిర్చి, పసుపు, ఉద్యానవన పంటలు వేయడం జరిగిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 25 లక్షల ఎకరాలు వివిధ ప్రాజెక్టుల కింద సాగు అవుతుండగా 50లక్షల ఎకరాలు బోర్ల ద్వారా మిగతా పంటలు వర్షాధారంతో పండిస్తున్నారన్నారు. అలాగే, సీఎం ప్రత్యేక శ్రద్ధతో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం కల్పిస్తూ 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలను దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకొని 40లక్షల ఎకరాలకు సాగునీరు అందించబోతున్నామని స్పష్టం చేశారు. ఉత్తర తెలంగాణకు ప్రాణహితమే ఆధారమని, అలాగే, త్వరితగతిన పూర్తి కాబోతున్న డీండి, సీతారామ, పాలమూరు ప్రాజెక్టుల ద్వారా ఉత్తర తెలంగాణలోని మరో 40లక్షల ఎకరాల పంటలకు సాగు నీరు అందించబోతున్నామన్నారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా చేపట్టిన వరినాట్లు వేసే యంత్రాల ద్వారా కలిగే ఆధునిక పద్దతులు రైతులు అవగాహన చేసుకొని వ్యవసాయ రంగం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం కేసీఆర్ కలలను సాకారం చేయాలన్నారు. ఎస్సారెస్పీ దిగువ ప్రాంతంలోని రైతులకు కాళేశ్వరం ప్రాజెక్టు నుండి రివర్స్ పంపింగ్ ద్వారా ప్రాజెక్టు నింపి 2పంటలకు సాగు నీరు అందిస్తామన్నారు. విద్యావంతులు వ్యవసాయ రంగంలో స్థిరపడాలని సీఎం సదుద్దేశంతో అన్ని ఆధునిక యాంత్రీకరణను సబ్సిడీపై అందిస్తున్నామని అధిక దిగుబడులు సాధించేందుకు వ్యవసాయ రంగంలో రాణించవచ్చన్నారు. అన్నదాతలు అప్పుల ఊబిలో నుండి బయటపడేందుకు రైతుబంధు, రైతుబీమా పథకాలతోపాటు 24గంటల ఉచిత విద్యుత్ సీఎం కేసీఆర్ అందిస్తున్నారన్నారు. గత రబీ సీజన్‌లో లక్షా 60 టన్నుల వరి పంట దిగుబడి వచ్చిందని ఈ యాంత్రీకరణతో ఈ ఖరీఫ్‌లో రెట్టింపు అవుతున్న దృష్ట్యా నియోజక వర్గానికో మొక్కజొన్న, వరి ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయాలనేసంకల్పంతో సీఎం కేసీఆర్ ఉన్నారని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రవీణ్‌రావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, జేసీ బి. రాజేశం తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..వరినాట్లు వేసే యంత్రాన్ని వ్యవసాయ క్షేత్రంలో నడుపుతున్న మంత్రి పోచారం