తెలంగాణ

టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా కేకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావును టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నియమించారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, ఎన్నికల మేనిఫెస్టో కమిటీ వివరాలను ప్రకటించారు. ఈ కమిటీలో సభ్యులుగా జితేందర్‌రెడ్డి, జీ. నగేష్, ఈటల రాజేందర్, టీ. హరీష్‌రావు, జీ. జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, అజ్మీరా చందూలాల్, కొప్పుల ఈశ్వర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఫరీదుద్దీన్, పీ. రాములు, గుండు సుధారాణి ఉంటారని కేసీఆర్ వివరించారు. గత నాలుగున్నర ఏళ్లుగా తాము చేసిన పనులను వివరిస్తూ, భవిష్యత్తులో చేయబోయే పనులను మేనిఫెస్టోలో పొందుపరుస్తామన్నారు.