తెలంగాణ

ఆదిలాబాద్ జిల్లాలో పాడిపరిశ్రమాభివృద్ధికి రూ.18 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: ఆదిలాబాద్ పాత జిల్లాల్లో పాడిపరిశ్రమాభివృద్ధికోసం ప్రభుత్వం 18 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆదిలాబాద్‌లో రోజూ 20 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన డెయిరీని కొత్తగా ఏర్పాటు చేస్తారు. అలాగే నిర్మల్ మిల్క్ చిల్లింగ్ సెంటర్‌ను రోజూ పదివేల లీటర్ల డెయిరీగా, ఆసిఫాబాద్, లక్సెట్టిపేటలలో రోజూ 10 వేల లీటర్ల పాల సామర్థ్యం గల చిల్లింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. రుయ్యాడ/బరంపులో ఐదు టన్నుల సామర్థ్యం కల ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారని పశుసంవర్థకం పాడిపరిశ్రమ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు.