తెలంగాణ

రాజకీయ లబ్ధి కోసమే అసెంబ్లీ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంకరపట్నం, సెప్టెంబర్ 6: ప్రత్యేక రాష్ట్రాన్ని ఉద్యమాల ద్వారా సాధించుకున్నామని, దీనిని బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పి బార్ తెలంగాణగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చాడని బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ కన్వీనర్, రాష్ట్ర సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో గురువారం ఆయన బీపీఎల్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో స్వార్థ రాజకీయ ప్రయోజనాల లబ్ధికోసం టిఆర్‌ఎస్ అధ్యక్షులు కేసీఆర్ తెలంగాణ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అహంకారంతో గురువారం టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని రద్దుపర్చుకోవడం అవివేకమన్నారు. ఇటీవల జరిపిన ప్రగతి నివేదన సభ తుస్సుమందని, ఆ సభలో నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి పనులు, అవినీతి లాంటివి ఏ మాత్రం ఉచ్ఛరించకుండా నిరాశ, నిస్పృహలతో కేసీఆర్ ప్రసంగించారని ఆయన విమర్శించారు.
మరోమారు తెలంగాణలో గెలుపొందుతామన్న ధీమా ఉన్న కేసీఆర్ ముందస్తు ఎన్నికల కోసం సమాయత్తం కావడంలో ఆంతర్యమేమిటని వీరభద్రం ప్రశ్నించారు. ప్రగతి నివేదన బహిరంగ సభ సందర్భంగా వరంగల్ జిల్లాలో 11 కోట్ల మద్యం విక్రయాలు కొనసాగాయని ఆయన మండిపడ్డారు. అధికారంలోకి రాకముందు చెప్పిన మాటలను విస్మరించి తెలంగాణ ప్రజలను అన్ని రంగాలలో వెనుకంజలో ఉంటూ తాను, తన కుటుంబ సభ్యులను మాత్రమే అభివృద్ధికి పాటుపడినారని, ఇలాంటి స్వార్థ రాజకీయ పరులను తెలంగాణ ప్రజలు రానున్న ఎన్నికల్లో భూ స్థాపితం చేసేందుకు సిద్ధమవుతున్నారని ఆయన అన్నారు.

చిత్రం..శంకరపట్నంలో మాట్లాడుతున్న వీరభద్రం