తెలంగాణ

ఉద్యమించిన ఉద్యోగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ తమ భవిష్యత్‌పై నిర్లక్ష్యం చేస్తున్నారని 108, సర్వశిక్షా అభియాన్‌లో పని చేస్తున్న ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. తమ సమస్యలు చెప్పుకోవడానకి తెలంగాణ భవనం వద్దకు భారీగా తరలివచ్చిన 108 ఉద్యోగులను అక్కడి నుంచి పంపించడానికి ప్రయత్నించారు. తెలంగాణ భవనంలోకి చొచ్చుకుని పోవడానకి ప్రయత్నించిన 108 ఉద్యోగులపై పోలీసులు దురుసుగా వ్యవహరించారు. అలాగే ప్రగతి భవనం ఎదుట సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లు అమలు చేసేదాకా ఆందోళన చేపడతామని వారు నినాదాలు చేశారు. ప్రగతి భవనం ఎదుట రహదారిపై ఆందోళన చేపట్టడంతో అక్కడ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు రంగప్రవేశంతో ఆందోళన కారులను అక్కడి నుంచి తరలించారు. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయని అనుకున్నామని, కానీ చాలీచాలని జీతాలతో ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయిస్తోందని వారు వాపోయారు.