తెలంగాణ

టీడీపీ నేత రమణ సారథ్యంలో పొత్తుల కమిటీ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 9: ముందస్తు ఎన్నికల్లో వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరిపి పొత్తులు కుదుర్చుకోవడానికి వీలుగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ సారథ్యంలో ఎన్నికల సమన్వయ కమిటీ ఏర్పాటైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై ఈ మేరకు సూచనలు చేశారు. దీంతో సమన్వయ కమిటీ పొలిట్ బ్యూరో సభ్యులు టీ. దేవేందర్ గౌడ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, నామా నాగేవ్వర రావు, రేవూరి ప్రకాశ్ రెడ్డి, పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి ఇ. పెద్దిరెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు మండవ వెంకటేశ్వర రావును సభ్యులుగా నియమిస్తూ రమణ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ప్రణాళిక కమిటీ చైర్మన్‌గా మాజీ మంత్రి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు టీ. దేవేందర్ గౌడ్‌ను నియమించారు. కన్వీనర్‌గా పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డిని, కేంద్ర పార్టీ క్రమశిక్షణా సంఘం సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులును, పార్టీ ఉపాధ్యక్షుడు అలీ మస్కతి, బండ్రు శోభారాణిని సభ్యులుగా నియమించారు. ఎన్నికల ప్రచార కమిటీ సారథిగా పార్టీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులు గరికపాటి మోహన్ రావును, సండ్ర వెంకట వీరయ్యను, కేంద్ర కమిటీ కమిటీ అధికార ప్రతినిధులు కొత్తకోట దయాకర రెడ్డిని, అరవింద్‌కుమార్ గౌడ్‌ను, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్‌ను సభ్యులుగా నియమించారు.