తెలంగాణ

టికెట్ల కేటాయింపులో ‘స్థానికత’ లొల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, సెప్టెంబర్ 10: టీఆర్‌ఎస్‌లో అసెంబ్లీ టికెట్ల రాజకీయం రోజుకో విధంగా రంగులు మారుతోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని మూడు సెగ్మెంట్‌లలో పార్టీ అధిష్ఠానం వైఖరిపై అసమ్మతి నేతలు ధిక్కారస్వరాన్ని వినిపిస్తూ అందోళన బాట పడుతున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో కెసి ఆర్‌కు విదేయుడైన నల్లాల ఓదెలుకు టికెట్ నిరాకరించడాన్ని నిరసిస్తూ ఆయన వర్గీయులు రెండు రోజులుగా తమ అసమ్మతిని వెళ్లగక్కుతున్నారు. ఇంతకు ముందు జరిగిన సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో పథకం ప్రకారమే టిబిజికెఎస్‌ను ఓడించి ఎంపీ బాల్క సుమన్ తనపై నిందలు మోపారని, ముందస్తు వ్యూహంతోనే సుమన్ చెన్నూర్ టికెట్‌పై పంతం నెగ్గించుకున్నాడని తాజా మాజీ ఎమ్మెల్యే ఓదెలు వివాదస్పదమైన వ్యాఖ్యలు చేయడం టీఆర్‌ఎస్ పార్టీలో అలజడి రేపుతోంది. టికెట్ల ఖరారు అనంతరం బాల్క సుమన్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, కేసీఆర్ పునరాలోచించి తనకే టికెట్ ఇస్తారని ప్రకటించుకోవడం ద్వారా చెన్నూర్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓదెలు వర్గీయులు గులాబీ జెండాలతో రోడ్డెక్కి టికెట్ ఇవ్వాల్సింది స్థానికులకే తప్పా స్థానికేతరులకు ఇవ్వవద్దని అందోళన బాట పట్టడంతో బాల్క సుమన్ పరిస్థితి అయోమయంగా మారింది. ఇదిలా ఉంటే పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిసేందుకు మూడు రోజులుగా రాజధానిలోనే మకాం వేసి ఓదెలు తన అనుచరులతో గట్టి ప్రయత్నాలు సాగిస్తున్నారు. కాగా ఖానాపూర్ నియోజకవర్గంలోనూ టీఆర్‌ఎస్ పార్టీలోని రెండు గ్రూపులుగా చీలిపోయి రాథోడ్ రమేష్, రేఖానాయక్‌కు మద్దతుగా ఎవరికివారు ప్రచారం వేడెక్కిస్తున్నారు. టీఆర్‌ఎస్ అధిష్ఠానం నుండి సోమవారం వరకు ఎలాంటి పిలుపురాకపోవడంతో హుటాహుటిన రాథోడ్ రమేష్ హైదరాబాద్ తరలివెళ్ళడం ఆసక్తిని రేపుతోంది. ఈనెల 12న ఏఐసీసీ అగ్రనేత గులాంనబీ ఆజాద్ హైదరాబాద్ వస్తుండగా పార్టీలో చేరితే ఖానాపూర్ టికెట్ ఇస్తామని రాయబారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీగా పనిచేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ పెద్దలు రాథోడ్‌తో మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. రెండు రోజుల్లో టీఆర్‌ఎస్ అధిష్ఠానం ఎటుతేల్చుకోని పక్షంలో రాథోడ్ రమేష్ కాంగ్రెస్ గూటికి వెళ్ళడం ఖాయమని ఆయన అనుచరులు స్పష్టం చేస్తున్నారు. అయితే చెన్నూర్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో తాజాగా స్థానికత అంశం తెరపైకి ఎక్కడంతో గ్రూపు రాజకీయాలు రూపుమారడం ఆసక్తినిరేపుతోంది. స్థానికేతర అభ్యర్థి అయిన రేఖానాయక్‌కు టికెట్ రద్దుచేసి రాథోడ్ రమేష్‌కు కేటాయించాలని బలమైన వర్గం నేతలు పట్టుబడుతూ అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు బోథ్ నియోజకవర్గంపై ఆశలు పెంచుకొని అన్ని ప్రయత్నాలు సాగించి విఫలమైన ఎంపీ గెడం నగేష్‌కు బోథ్ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని పట్టుబడుతూ ఆయన వర్గీయులు సోమవారం హైదరాబాద్‌కు తరలివెళ్ళారు. లేదంటే తాము ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాథోడ్ బాపురావు స్థానికేతరుడైనందున ఎంపీ నగేష్‌కే అవకాశం కల్పించాల్సిందిగా వారు పట్టుబడుతున్నారు. దీంతో టీఆర్‌ఎస్ పార్టీలో చాపకింద నీరులా సాగిన గ్రూపు రాజకీయాలు ఒక్కసారిగా వీదికెక్కడంతో అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్నది వేచి చూడాల్సిందే.