తెలంగాణ

లక్ష్యం.. 40 కోట్ల మొక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, సెప్టెంబర్ 11: దేశంలోనే ప్రథమంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ కేంద్రంలో స్మృతి వనాన్ని ఏర్పాటు చేశామని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ పి.కె.జా వెల్లడించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ స్మృతి వనం చారిత్రాత్మకమన్నారు. చౌటుప్పల్‌లో ఏర్పాటు చేసిన స్మృతి వనాన్ని మంగళవారం అటవీ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. స్మృతి వనంలో ఏర్పాటు చేసిన అమరవీరుల చిహ్నం వద్ద పుష్పగుచ్చాలు పెట్టి నివాళ్లర్పించారు. స్మృతి వనంలో మొక్కలు నాటారు. లక్కారం శివారులోని అటవీశాఖ భూమిలో సుమారు నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా జా మాట్లాడుతూ దేశానికే చౌటుప్పల్‌లో ఏర్పాటు చేసిన స్మృతి వనం ఆదర్శమవుతుందని పేర్కొన్నారు. మరణించిన వ్యక్తుల పేరుతో ఐదు వేల రూపాయలు చెల్లిస్తే స్మృతి వనంలో మొక్కను నాటి పెంచుతామన్నారు. ఆ మొక్క చెట్టై తరతరాలుగా గుర్తుండిపోతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో విజయవంతమవుతుందన్నారు. ఇప్పటికే హరితహారంలో 93 కోట్ల మొక్కలు నాటామన్నారు. ఈ యేడాది 40 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించి ఇప్పటికే 27.50 కోట్ల మొక్కలు నాటామని వివిరంచారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 24 శాతం అటవీ క్షేత్రం ఉందన్నారు. అందులో 9 శాతం మాత్రమే దట్టమైన అడవులు ఉన్నాయన్నారు. మిగిలిన అటవీ క్షేత్రంలో అడవులను పెంచేందుకు ముమ్మరంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. అటవీశాఖలో 52 మంది సిబ్బంది ఉన్నారన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను రెండు నెలల్లో భర్తీ చేయనున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ మాట్లాడుతూ జిల్లాను హరితయాదాద్రిగా మార్చేందుకు పెద్ద ఎత్తున ఉద్యమంగా హరితహారం కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. 1.60 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోని ఊరూరా నర్సరీలను పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. అటవీశాఖ ఉన్నతాధికారులు పి.రఘువీర్, ఎం.పృద్వీరాజ్, ఆర్.శోభ, మునీంద్ర, ఆర్.ఎం.దోబ్రియాల్, లోకేష్‌జైశ్వాల్, స్వర్గం శ్రీనివాస్ పాల్గొన్నారు.

చిత్రం..మొక్కలు నాటుతున్న అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ జా