తెలంగాణ

మహిళల అక్రమ రవాణా అరికట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, సెప్టెంబర్ 18: జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో చోటుచేసుకుంటున్న మహిళల అక్రమరవాణా రోజురోజుకు పెరిగిపోతోందని, ప్రపంచవ్యాప్తంగా వ్యభిచార వృత్తిలో 75 మిలియన్ల మహిళలు, యువతులు, బాలికలు మగ్గుతున్నారని బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూఫ్లెమింగ్ ఆవేదన వ్యక్తపరిచారు. మంగళవారం రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఫరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లా డీపీఓ కార్యాలయంలో మానవ అక్రమ రవాణ - పోలీసుల పాత్ర- చేపట్టాల్సిన చట్టపర చర్యలపై రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్‌భగవత్ అధ్యక్షతన అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈసమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆండ్రూ ఫ్లెమింగ్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మానవ అక్రమ రవాణ ప్రభావితం చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ముఠాలకు కోట్ల డాలర్లు సంపాదించిపెట్టే క్రిమినల్ పరిశ్రమగా అవతరించడంపై ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. సెక్స్ ట్రాఫికింగ్‌కు గురవుతున్న వారిలో మహిళలతోపాటు పురుషులుకూడా బాధితులేనని వివరించారు. జాతీయ క్రైంరికార్డు బ్యూరో గణాంకాల మేరకు దేశంలో నమోదైన క్రిమినల్ కేసులలో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉండడం బాధాకరమని అన్నారు. ఈనేరాలను అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బ్రిటీష్ ప్రభుత్వం సహాయ సహకారాలను అందించనున్నదని తెలిపారు. తాను సౌతాఫ్రికా, నైజీరియా, ఇరాక్, ఘనా, అప్ఘనిస్తాన్ వంటి దేశాలలో చోటుచేసుకుంటున్న మానవ అక్రమ రవాణాను నివారించేందుకు కృషిచేసినట్లుగా తెలిపారు. లైంగిక వేధింపులతో బాలికలు, బాలురుకూడా బలవుతున్నారని అన్నారు. తన నిజజీవితంలో చోటుచేసుకుంటున్న అనేక సంఘటనలు చలింపచేశాయని అన్నారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మానవ అక్రమ రవాణా, దుష్పరిమాణాలు అరికట్ట్టే పద్ధతులను ఆయన వివరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని యాదగిరిగుట్ట పట్టణంలో చోటుచేసుకున్న మానవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపామని తెలిపారు. యాదగిరిగుట్ట వ్యభిచార గృహాలలో మగ్గుతున్న బాలికలకు విముక్తి కలిగించడంతోపాటు వ్యబిచార గృహాల నిర్వాహకులపై పీడీ యాక్టు ప్రయోగించామన్నారు. ఈకేసులలో సత్వర పరిష్కారంకోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేయమని న్యాయాధీశులతో కోరినట్లుగా తెలిపారు. ఈసమావేశంలో ధరణి ఫౌండేషన్ ప్రతినిధి డాక్టర్ మమత రఘువీర్, బ్రిటన్ డిప్యూటీ హైకమిషన్ రాజకీయ విశే్లషకురాలు నళిని రఘురామన్, ట్రాఫికింగ్ ఇన్ ఇండియా హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి రామ్మోహన్‌తోపాటు డీసీపీ రాంచంద్రారెడ్డి, ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు, వివిద స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

చిత్రం..అవగాహన సదస్సులో మాట్లాడుతున్న బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్