తెలంగాణ

ఉత్తమ్‌కు చేతకాకే పొత్తులకు వెంపర్లాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 18: కాంగ్రెస్, టీడీపీల కలయికను తెలంగాణ సమాజం ఒప్పుకోదని, తెలంగాణ రాష్ట్రం రాకుండా అడుగడుగున అడ్డుకున్న చంద్రబాబుకు ఇక్కడ స్థానమే ఉండదని, విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న కాంగ్రెస్‌ను రాజకీయంగా ప్రజలు బతకనివ్వరని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆరోపించారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు విలేఖరుల సమావేశంలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులు అమరులు కావడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. ప్రస్తుతం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ నాయకులు అమరుల కుటుంబాలపై ఎంతో ప్రేమ ఉందని నటిస్తున్నారని విమర్శించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ ఎన్నికల్లో అమరుల ఆశయాలే కాంగ్రెస్ ఎజెండా అంటూ చెప్పడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి తెలంగాణలో రాజకీయం తనకు చేతకాదని ప్రజలంతా కేసీఆర్ వెంట ఉన్నారని దిక్కుతోచక ఆంధ్ర పార్టీల వెంట పడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇక మహాకూటమికి నూకలు చెల్లిన్నట్లేనని టీడీపీ జతకడితే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు పార్టీ జెండాను సైతం ఎగురవేయడానికి కూడా దొరకరని విమర్శించారు. పొత్తులంటేనే చేతకాకపోవడమేనని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేతకాని నాయకుడని అన్నారు. మహాకూటములు ఎన్ని ఏర్పడ్డ మళ్లీ తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కావడం తథ్యమని ఇది ఎవరు ఆపలేరని అన్నారు. పాలమూరు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలుస్తారని మహాకూటమికి పరాజయం తప్పదని జోస్యం చెప్పారు. మహాకూటమి అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతుకావడం గ్యారంటీ అని అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంపై కేసులపై కేసులు వేసిన కాంగ్రెస్ పార్టీని జిల్లా ప్రజలు బొందపెట్టడం ఖాయమన్నారు. వెనకబాటుకు, వలసలకు నిలయంగా మారిన జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ పెద్ద మనస్సుతో పాలమూరు ఎత్తిపోతల పథకం సాగునీటి ప్రాజెక్టును మంజూరు చేస్తే ఇలాంటి ప్రాజెక్టుకు అడ్డుతగులుతున్న వారిని పాలమూరు జనం ఎలా ఊరుకుంటారని హెచ్చరించారు. నాలుగేళ్ల టీఆర్‌ఎస్ అభివృద్ధి కళ్లకు కనిపిస్తున్నా కనిపించని కబోదుల్లా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న తీరు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించడం తొలి దశ ఉద్యమమని రాష్ట్రం వచ్చాక పునర్ నిర్మాణం చేసుకుకోవడం రెండవ దశ ఉద్యమమని రెండవ దశ ఉద్యమమే అభివృద్ధి అన్నారు. ఈ ఉద్యమంలో కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని ప్రజలను గందరగోళం చేయడానికి కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్ నాయకులపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. మహబూబ్‌నగర్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి లక్ష్మారెడ్డి