తెలంగాణ

బాధితులను పరామర్శించే తీరిక లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, సెప్టెంబర్ 19: రాష్ట్రంలో ప్రజలు రోడ్డు ప్రమాదాలకు గురై వందల మంది చనిపోయినా.. కుల దురహంకార హత్యలకు గురైనా వారిని పరామర్శించిన, కనికరించిన పాపాన పోలేదని అపద్ధర్మ సీఎం కేసీఆర్ పోలేదని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో కులదురహంకార హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్‌కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మాట్లాడుతూ మిర్యాలగూడలో దారుణ హత్యకు దళిత యువకుడు గురైన సీఎం కేసీఆర్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, జిల్లా మంత్రి జగదీశ్వర్‌రెడ్డిలు కాని స్పందించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో బస్సు, ట్రాక్టర్‌ల రోడ్డు ప్రమాదాల్లో వందల మంది చనిపోయిన అక్కడికి వెళ్లి మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించిన పాపాన కేసీఆర్ పోలేదన్నారు. సచివాలయానికి రాకుండా ప్రగతి భవన్‌లో ఉంటు పాలన సాగిస్తు ప్రజల బాగోగులను పట్టించుకోకుండా ఉన్నారని ఆరోపించారు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 60 మంది చనిపోయిన కెసిఆర్ చలించలేదన్నారు. అందుకే హత్యల, మృతుల రాష్ట్రంగా మారుతుందన్నారు. టీఆర్‌ఎస్ సభ్యత్వం కలిగి ఉన్న తిరునగరు మారుతీరావును సస్పెండ్ చేయాలన్న ఆలోచన కూడ లేదని విమర్శించారు. అమృత రాజకీయాల్లోకి రావాలనుకుంటే తమ పార్టీ తలుపులు తెరచి ఉంటాయన్నారు. అదే విధంగా మహాకూటమి అధికారంలోకి వస్తే కోటి రూపాయలు ఆర్దిక సహాయమందిస్తామన్నారు. ఆమెకు ఉద్యోగం, పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. ఆయన వెంట టీడీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, మాజీ ఎమ్మెల్యే బక్కా నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ప్రణయ్ తండ్రి, తమ్ముడిని పరామర్శిస్తున్న టీటీడీపీ అధ్యక్షుడు రమణ తదితరులు