తెలంగాణ

కీకారణ్యం నుంచి జనారణ్యంలోకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 20: కొండలు, గుట్టలు, అరణ్యాల్లో సంచరించాల్సిన ఎలుగుబంటి జనారణ్యంలోకి వచ్చింది. నిత్యం వేలాది మందితోకిటకిటలాడుతూ, అనేక వ్యాపారాల కూడలిలో హల్‌చల్ చేసింది. పలు వీధుల గుండా సంచరిస్తూ, వ్యాపారస్థులు, స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. పట్టుకోవడానికి ప్రయత్నించిన పోలీసులు, అటవీశాఖాధికారులను ముప్పు తిప్పలు పెట్టి, మూడు చెర్ల నీళ్ళు తాగించింది. ఎనిమిది గంటల పాటు అందరినీ హైరానా పెట్టించి, తుదకు చిక్కింది. గురువారం జిల్లా కేంద్రంలోని టవర్‌సర్కిల్‌లో జరిగిన ఈసంఘటన పరిసర ప్రాంతాల వాసులను భీతావహులను చేసింది. వేకువజామునే నగరంలో ప్రవేశించిన ఎలుగు నగరంలోని శనివారం అంగడి, వినాయక మార్కెట్, ఎస్‌బి ఐ బ్యాంకు, ప్రొ. జయశంకర్ విగ్రహం, మదీన కాంప్లెక్స్, తదితర ప్రాంతాల్లో ఘీంకారాలు చేస్తూ పచార్లు కొడుతుండగా, పలువురు గమనించి పెద్ద పెద్ద శబ్ధాలు చేస్తూ తరిమికొట్టేయత్నం చేశారు. దీంతో పరుగు లంకించుకున్న ఎలుగు సమీపంలోని బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలోకి దూరింది. ఆరుబయట ఉన్న బాత్రూంలోకి చొరబడి అరుపులు, కేకలు వేయటం ప్రారంభించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, వారు వెంటనే అటవీశాఖాధికారులకు చేరవేసి, అక్కడికి చేరుకున్నారు. వారితో కలిసి కార్యాలయం చుట్టూ మోహరించి, భారీ వలలు వేసి పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. వరంగల్ నుంచి వన్యప్రాణుల సంరక్షణ అధికారులు వచ్చి మత్తు ఇంజక్షన్‌లు పేల్చేయత్నం చేయగా, పలుమార్లు విఫలమయ్యాయి. పదే పదే విసురుతుండగా, టెలికాం కార్యాలయం నుంచి బయటకు పరుగెత్తుకుంటూ వచ్చి, పక్కనే ఉన్న చెట్టు ఎక్కుతుండగా, మరోసారి మత్తు ఇంజక్షన్లు పేల్చారు. తుంటికి తాకి మత్తు ఆవరించింది.
చెట్టుపైనుంచి కిందపడగా అప్రమత్తమైన పోలీసులు, అటవీ అధికారులు పట్టుకుని అటవీశాఖ వాహనంలోకి ఎక్కించటంతో కథ సుఖాంతమైంది. టవర్ ప్రాంతంలో ఎలుగుబంటి సంచరిస్తున్న విషయం నగరంలో దావానంలా వ్యాపించటంతో పెద్దసంఖ్యలో నగరవాసులు గుమిగూడి తిలకించారు. జనాల ఈలలు, కేరింతలతో కంగారుపడిన ఎలుగు పలుమార్లు వీధుల్లోకి వచ్చేయత్నం చేయగా, పోలీసులు గుంపులను చెదరగొట్టి, సమీపంలోని వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూసివేయించారు. ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు టవర్ సర్కిల్ ప్రాంతంలో టెన్షన్ నెలకొనగా, ఎట్టకేలకు అటవీ అధికారుల మత్తుకు పడిపోవటంతో వ్యాపార,వాణిజ్య వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. కాగా, గతంలో కూడా ఎలుగుబంటి జిల్లాకేంద్రంలో సంచరించి, అటవీశాఖ కార్యాలయంలో చొరబడింది. కొద్దిరోజులుగా బొమ్మకల్ గ్రామ పరిసరాల్లో పిల్లల ఎలుగు సంచరిస్తున్నట్లు గ్రామస్థులు పేర్కొంటుండగా, అటువైపునుంచే నగరంలోకి ప్రవేశించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెల్పుతున్నారు. తరచుగా నగరంలోకి అటవీ జంతువులు ప్రవేశిస్తుండటం షరామామూలుగా మారిందని ప్రజలు చర్చించుకోవటం గమనార్హం.