తెలంగాణ

ఎన్నికలకు ఉత్తమ్ సై, శశిధర్‌రెడ్డి నై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: ఎన్నికలకు ఎప్పుడైనా సిద్దమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒకవైపు సవాల్ చేస్తుంటే, అదే పార్టీకి చెందిన మర్రి శశీధర్‌రెడ్డేమో ఇప్పుడే నిర్వహించవద్దని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడమేమిటనీ టీఆర్‌ఎస్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ప్రశ్నించారు. ప్రాజెక్టులను అడ్డుకోవడానికే కాకుండా చివరకు ఎన్నికలపై కూడా కాంగ్రెస్ నేతలు కోర్టు పక్షుల్లా మారారని వినోద్ ఎద్దేవా చేసారు. గురువారం తెలంగాణ భవన్‌లో వినోద్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఎవరి ప్రయోజనాల కోసం ఎన్నికలు వద్దని సుప్రీంకోర్టులో కేసు వేసారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో ఒకమాట ఉండదా? అని మండిపడ్డారు. ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు, సూచనలు చేయాల్సిన బాధ్యతను కూడా కాంగ్రెస్ విస్మరించిందన్నారు. ప్రతిపక్షంగా కూడా కాంగ్రెస్ పార్టీ పనికిరాదన్నారు. టీఆర్‌ఎస్‌తో కలిసి పని చేయాలని ఉందని టీడీపీ అధినేత, ఆంధ్ర సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ తెలంగాణకు పచ్చి వ్యతిరేకి ఆయన్ను ఎలా నమ్ముతామని ప్రశ్నించారు. కలిసి పని చేయాలని ఉంటే, కాళేశ్వరం ప్రాజెక్టును ఆపాలని కేంద్రానికి ఫిర్యాదు ఎందుకు చేసారని వినోద్ ప్రశ్నించారు. ఎన్డీయేతో సఖ్యతగా ఉండి ఆయన పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చుకుంటే, తాము కాళేశ్వరం ప్రాజెక్టుకు తెచ్చుకున్నామని వినోద్‌కుమార్ గుర్తు చేసారు. తెలంగాణకు పచ్చి వ్యతిరేకి అయిన ఆయనతో తాము ఎలా కలిసి పని చేస్తామని ప్రశ్నించారు. డబై లక్షల ఓట్లు తొలగించారని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించడంతో జాబితాలో లేని వారు నమోదు చేసుకోవచ్చుకదా అని వినోద్‌కుమార్ సూచించారు.